తెలుగు రాష్ట్రాల్లోని ఎగ్జిబిటర్లకు నిర్మాతల మండలి లేఖ రాసింది.సంక్రాంతి పండుగకు తెలుగు సినిమాల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.2017 సంవత్సరంలోనే తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఈ నిర్ణయం తీసుకుందని లేఖలో పేర్కొన్నారు.ఈ నిర్ణయాన్ని ఎగ్జిబిటర్లు తప్పకుండా పాటించాలని నిర్మాతల మండలి తెలిపింది.
తెలుగు చలన చిత్ర పరిశ్రమను కాపాడుకుందామని ఈ మేరకు నిర్మాతల మండలి పిలుపునిచ్చింది.