అయ్యప్ప దీక్ష( Ayyappa initiation ) అనేది ఎంతో కఠోర నియమాలతో చేపట్టాలి.శరణం శరణం అంటూ కోరిన కోరికలు తీర్చాలని కష్టాల నుండి గట్టెక్కించాలని ధృఢ సంకల్పంతో చేసే దీక్షయే అయ్యప్ప దీక్ష.
అయ్యప్ప దీక్షను లేక నియమ నిబంధనలతో కేరళలోని శబరిమలైకి 18 కొండలు, 18 మెట్ల పై అధిష్టించి కూర్చున్న ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని దీక్ష కార్తీకమాసంలో ప్రారంభమవుతుంది.అయితే అయ్యప్ప మాల ధరించిన వాళ్ళు నల్ల దుస్తులను ఎందుకు ధరిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా మాలను చలికాలంలో ధరించడం వలన వేడిని గ్రహించి శరీరానికి రక్షణ కల్పిస్తుంది.శబరిమల యాత్రకు అడవులలో ప్రయాణం చేయడం వలన అడవి జంతువుల నుండి నలుపు రంగు మనకు రక్షణగా ఉండడం వలన అయ్యప్ప మాల ధరించే వారు నలుపు రంగు దుస్తులను ధరిస్తారు.
ఈ విధంగా అయ్యప్ప మాల ధరించిన వారికి దేవుడు అనుగ్రహం కలగడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు( Health benefits ) కూడా పొందవచ్చు.శనిదేవుడుకు నల్లని రంగు అంటే చాలా ఇష్టం.
ఆ రంగు బట్టలు ధరించిన వాళ్ళకి శని దేవుడు హాని కలిగించడు.

అలాగే అయ్యప్ప తన భక్తులను కాపాడడానికి నల్లని రంగు దుస్తులు ధరించమని చెప్పాడనీ , కాబట్టి అయ్యప్ప స్వాములు నలుపు రంగు దుస్తులను( Black dress ) ధరిస్తారని చెబుతారు.అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులు మండల కాలం పాటు అంటే 41 రోజులు దీక్ష తీసుకొని ఇరుముడి కట్టుకుంటారు.మాలధారణ చేసిన స్వాములు 41 రోజులపాటు అత్యంత నియమ నిష్ఠలతో అయ్యప్పను పూజిస్తారు.
ఇక భక్తులు అయ్యప్ప మాల ధరించి మకర సంక్రాంతి వరకు నియమనిష్ఠలతో కఠిన దీక్షలను చేస్తారు.ఇక సంక్రాంతి రోజున మకర జ్యోతిని దర్శించుకుని మాలను శబరి ఆలయంలో స్వామి సన్నిధిలో తొలగించి వస్తారు.

కానీ ఈ మాలను ధరించినన్ని రోజులు చాలా నియమనిష్ఠలతో స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండాలి.ఇలా కఠిన నియమాలతో ఆచరించిన అయ్యప్ప దీక్ష ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందిస్తుంది.అంతేకాకుండా ఆరోగ్యాన్ని సైతం పెంపొందిస్తుంది.అయ్యప్ప మాల ధరించిన వారు వేకువ జామునే లేచి చన్నీటి నీటితో స్నానాలు ఆచరించి, భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజలు చేయాలి.
ఇలా చన్నీటితో స్నానం చేయడం వలన మనసు తేలికగా ఉండి భక్తి ఏకాగ్రత పెరుగుతుంది.
DEVOTIONAL