తిరుమల: వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం సాధించి, ప్రజల ఆశీస్సులతో మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు.ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తో పాటు, ఎంపీ సంజీవ్ కుమార్, టిడిపి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, సినీ నటుడు ప్రభుదేవా, నటి సురేఖ వాణి, వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు.
వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకుగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు.
ఆలయం వెలుపల ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ, పేద ప్రజల సంక్షేమం కోసం నవరత్నాల పథకాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంస్కరణలు తీసుకువచ్చి అమలు చేశారన్నారు… వచ్చే ఎన్నికల్లో, తనకు టిక్కెట్టు రాదనే అంశంపై, అసహనం వ్యక్తం చేశారు.వైఎస్ షర్మిల రాక వల్ల తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఈసారి ఎన్నికల్లో కూడా తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.