శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడినమాజీ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.పారదర్శకంగా వచ్చిన టెండర్ ని నేను బిజెపిలో చేరడం వల్లే వచ్చిందని కట్టుకతలు అల్లి ఎన్నికలో లబ్ధి పొందారు జనాలు నమ్మకపోయినా విష ప్రచారం చేశారు రాజకీయంగా ఎదుర్కోలేక మళ్ళీ రెండోసారి ఆరోపణలు చేస్తున్నారు నేను మీడియా మిత్రులను కోరుతున్న ఏదైనా వార్త రాయాలి అనుకుంటే కనీసం ఒకసారి ఆలోచన చేయండి వ్యక్తిగతంగా నిజాయితీగా పనిచేసే మాలాంటి వ్యక్తుల్ని క్యారెక్టర్ ఎసాస్మెంట్ చేయడం మంచి పద్ధతి కాదు 8 సంవత్సరాలుగా కేసీఆర్, కేటీఆర్ కవితలాంటి వాళ్లు మల్లారెడ్డి లాంటి వాళ్లు టిఆర్ఎస్ నాయకులు వేలకోట్ల రూపాయలు దోచుకుంటే వాళ్లపై ఐటి దాడులు చేస్తే కక్ష సాధింపు చర్యలు అంటున్నారు .అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రాజెక్టుల రీ డిజైన్ పేరు మీద దోచుకున్న మాట వాస్తవం కాదా….? తెలంగాణ సమాజం మొత్తం ఒకసారి ఆలోచించండి వంద మంది ఎమ్మెల్యేలు డబ్బు, అధికారాన్ని దుర్వినియోగం చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని ఉప ఎన్నికల్లో గెలిచారు రేపు అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఎంతమంది పోలీసులను పెడతారు ఎన్ని కోట్లు ఖర్చు పెడతారు కెసిఆర్ కుటుంబం దోచుకున్న ప్రజల సొమ్ము అంతా కక్కిస్తాం.కెసిఆర్ కుటుంబం జైలుకు వెళ్లక తప్పదు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసిందని బిజెపిని బదనాం చేస్తున్నారు.తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది మీరు ఆ ఎమ్మెల్యేలను కొనాల్సిన కర్మ బిజెపికి లేదు ప్రజల మైండ్ ను డైవర్ట్ చేయడానికి బిజెపి పైన ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు.
తాజా వార్తలు