Vijayasai Reddy : అభివృద్ధి వికేంద్రీకరణ మూడు రాజధానులా?

అభివృద్ధి వికేంద్రీకరణ మూడు రాజధానుల పేరుతొ మూడేళ్ళుగా చేసిన జగన్మాయను, విన్యాసాలను రాష్ట్ర ప్రజలు ఒకసారి అర్ధం చేసుకోవాలి.పరిపాలన చేతకాక మూడేళ్లుగా మూడు రాజధానుల వివాదం సృష్టించి ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టించి,ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతూ కోట్లాది రూపాయల ప్రజాధనం కోర్టు కేసులకోసం దుర్వినియోగం చేస్తున్నారు.

 The Three Capitals Of Decentralization Of Development , Vijayasai Reddy, Rayalas-TeluguStop.com

రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతి రాజధానిని,హైకోర్టును మార్చే హక్కుగాని, మూడు రాజధానులు పెట్టే అధికారం లేదని తెలుసు.పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ జరిగితే తప్ప రాజధానిని మార్చడం ఎవరి తరం కాదు.

రాజాధానిని మార్చుకోనేందుకు పర్మిషన్ ఇవ్వాలని ఆమధ్య రాజ్యసభలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రైవేటు బిల్లు పార్లమెంట్ లో పెట్టడం ద్వారా అది మరింత తేటతెల్లమైంది.అయినా మూడేళ్లుగా మూడు రాజధానులు అంటూ విశాఖ లో పరిపాలనా రాజధానిని చేసి తీరుతామని అటు ఉత్తరాంధ్రా ప్రజలను, హైకోర్టును కర్నూలుకు తరలించి కర్నూలు లో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని ఇటు రాయల సీమ ప్రజలను మభ్యపెడుతూ రాజకీయ లభిపొందెందుకు ప్రజలను తప్పుదారి పట్టించేందుకు చెయ్యని ప్రయత్నం లేదు.

అద్భుతమైన రాజధాని నిర్మించే అవకాశాన్ని కాలరాసి మూడు రాజధానుల ఏర్పాటు చేయాలని జగన్ రెడ్డి తీసుకొన్న నిర్ణయం తుగ్లక్ నిర్ణయం అని న్యాయస్థానాల్లో రుజువు అవుతుంది.అమరావతిలో మాత్రమే అభివృద్ధిని కేంద్రీకరించడం కుదరదు.

రాష్ట్ర ప్రజలందరు చెల్లించే పన్నులతో అమరావతినే అభివృద్ధి చేస్తే మిగతా ప్రాంతాలు ఏం కావాలని, మా ప్రాంతం పరిస్థితి ఏమిటని ప్రజలను రెచ్చ గోట్టేందుకు రాయలసీమ, ఉత్తరాంధ్రలో కృత్రిమ ఉద్యమాలను ప్రారంభించారు.

ఈ సందర్బంగా సుప్రీంకోర్టులో మరో కీలకాంశమైన కర్నూలుకు హైకోర్టు తరలింపు కూడా ప్రస్తావనకు వచ్చింది.

కర్నూలుకు హైకోర్టు తరలింపు అంశంపై సుప్రీంకోర్టులో జస్టిస్‌ కెఎం జోసెప్‌ రాష్ట్ర హైకోర్టు ఎక్కడ వుండాలను కొంటున్నారు?ఇప్పటికే అమరావతిలో హైకోర్టు కొనసాగుతుంది.ఈ సమయయంలో కర్నూలుకు హైకోర్టును ఎందుకు తరలించాలని అనుకొంటున్నారు?ఈ విషయంలో మీ ఉద్దేశ్యం ఏమిటి? కేంద్ర ప్రభుత్వం,రాష్ట్రపతి ఉత్తర్వులు మార్చే అధికారం రాష్ట్రప్రభుత్వానికి ఉంటుందా?రాష్ట్రప్రభుత్వం తీసుకొనే నిర్ణయంలో ఎక్కడా కేంద్రానికి సంబంధించి ప్రస్తావన లేకుండా మార్చే నిర్ణయం తీసుకోవడం ఏమిటని ?సుప్రీంకోర్టు నిలదీయడంతో అమరావతిలోనే హైకోర్టు ఏర్పాటు చేస్తాం అని, కర్నూలుకు హైకోర్టును తరలించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ సమాధానం ఇచ్చారు.సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన అంశాలకు, కోర్టు బయట,ప్రజాక్షేత్రంలో మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలకు ఏ మాత్రం పొంతన లేదు.ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని స్పష్టంగా చెప్పారు.

దీనిపై కోర్టు రెట్టించి అడిగినప్పుడు కూడా మూడు రాజధానుల చట్టం రద్దు అయింది.కాబట్టి, హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని ఆయన అన్నారు.మరో చట్టం తెస్తే దానిలో ఏముంటుందో తనకు తెలియదని, ఇప్పటికైతే సిఆర్‌డిఎనే అమలులో ఉందని, దాని ప్రకారం హైకోర్టు అమరావతిలోనే ఉంటుంది అని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి వివరించారు.

Telugu Chandrababu, Jagan, Km Joseph, Rayalaseema, Vijayasai Reddy-Political

వికేంద్రీకరణ పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం కోర్టులో గట్టిగా ఎందుకు చెప్పలేదు .ఇన్నాళ్లు కర్నూలుకు హైకోర్టు తరలింపు,రాయలసీమలో న్యాయరాజధాని ఏర్పాటు అంటూ వుదరగొట్టింది.రాయల సీమ ప్రజలను మభ్యపెట్టడానికే తప్ప నిజంగా హైకోర్టు కర్నూలుకు తరలించడంపై ఆసక్తి లేదని, మూడు రాజధానుల పేరుతో ప్రజల్లో ప్రచారం చేసుకోని రాజకీయ లబ్ది పొందడానికే అని దీనితో రుజువైంది.

కర్నూలుకు హైకోర్టు తరలింపు,న్యాయరాజధాని ఏర్పాటు అంటూ జగన్ చేసిన మాయలు రాయల సీమ ప్రజలు ఇప్పటికైనా అర్ధం చేసుకోవాలి.న్యాయమూర్తి రాజధాని నగరం అనే భావన రాజ్యాంగంలో లేదని కూడా చెప్పడం విశేషం.

కర్నూలు కు హైకోర్టు రాకుండా చంద్రబాబు అడ్డు కొంటున్నారని చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని ఆరోపణలు చేస్తున్న వారు.ఇప్పుడు రాయలసీమకు ద్రోహులు ఎవరో చెప్పగలరా? అంతే కాదు రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల హక్కుల సంగతేంటని సుప్రీం కోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పునర్విభజన చట్టంలో ది కేపిటల్‌ అన్న పదం పొందుపరచారని, ది అంటే వన్‌ అండ్‌ ఓన్లీ అన్న అర్థం అని హైకోర్టు తన తీర్పులో వివరించింది.ఒక రాజధాని ది కాపిటల్‌ అని మాత్రమే ఉన్న విషయాన్నికూడా ప్రస్తావించింది.

పార్లమెంటు చట్టంలో సవరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేనప్పుడు,అందులో ఉన్న అంశాలను మార్చే అధికారం ఎక్కడ ఉంటుందని ధర్మాసం ప్రశ్నించింది.

అభివృద్ధి ఆశించి తమ భూములు త్యాగం చేసిన 29 వేల మంది రైతులకు చట్టబద్దంగా ఇచ్చిన హామీని ఎలా ఉల్లంఘిస్తారని ప్రశ్నించింది? సిఆర్‌డిఎ చట్టాన్ని అమలు చేయకపోతే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తారా ?అని నిలదీసింది.రాజధాని ప్రాంతంలో ఇప్పటికే ఖర్చు చేసిన దాదాపు రూ 50 వేల కోట్ల రూపాయల సంగతేంటని కూడా ప్రశ్నించింది? రైతుల హక్కులకు, చట్టబద్ధమైన ఒప్పందాల సంగతేమిటని నిగ్గదీసింది? అయినా సుప్రీంకోర్టు వికేంద్రీకరణకు మద్దతు ఇచ్చిందని అబద్దాలు చెబుతున్నారు మంత్రులు.ఇప్పటికి మూడురాజధానులకు కట్టుబడి ఉన్నామని,అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పాత పాటే పాడుతున్నారు మంత్రులు .ఒక రాజధాని కట్టలేరు.మూడు రాజధానులను ఏర్పాటు చేయనూ లేరు.

కర్నూలు కు హైకోర్టు ను తరలించడం లేదని సుప్రీం కోర్టులో ప్రభుత్వం చెప్పడంతో మూడు రాజధానుల జగన్ ముసుగు తొలగిపోయింది.కావునా పాలన చేతకాక ప్రాంతాల మధ్య కుంపట్లు రగిలించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్న జగన్మాయను ప్రజలు ఇప్పటికైనా అర్ధం చేసుకోవాలి.

ప్రభుత్వ పెద్దలు కూడా వాస్తవిక దృక్పధంతో వ్యవహరించాలి.యంపల చెట్లకు నిచ్చెనలు వెయ్యవద్దు.అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించి, బలపరిచిన అమరావతిని రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలి.ఉత్తరాంధ్రతో పాటు, రాష్ట్రంలో వెనుకబడిన ఇతర ప్రాంతాల అభివృద్ధికి ఆచరణాత్మక ప్రణాళికను రూపొందించాలి.

రాష్ట్రాభివృద్ధికి ఈ తరహా మాత్రమే దోహదం చేస్తుందన్న విషయాన్ని జగన్ ప్రభుత్వం గుర్తించాలి.మూడేళ్లుగా మూడు రాజధానులు అంటూ వేస్తున్న పిల్లి మొగ్గలకు ఇకనైనా ముగింపు పలకాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube