రామప్ప ఆలయానికి పొంచి ఉన్న ముప్పు.. ఎలాగంటే..

Effect Of Singareni Mining On Ramappa Temple Details, Ramappa Temple, Singareni, Mining, Singareni Mining, World Heritage Ramappa Temple, Warangal, Telangana, Singareni Collaries, Open Cast Mining

మన తెలంగాణ రాష్ట్రంలోని అపురూపమైన వరంగల్ రామప్ప ఆలయం మళ్లీ ప్రమాదంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి.అది ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందినందుకు ప్రతి తెలుగువాడు, అలాగే భారతీయుడు ఎంతో సంతోషించారు.

 Effect Of Singareni Mining On Ramappa Temple Details, Ramappa Temple, Singareni,-TeluguStop.com

ఆ సంతోషాన్ని సింగరేణి కాలరీస్ ఓపెన్ కాస్టింగ్ పనులు ఆవిరి చేస్తున్నట్లు సమాచారం.కేంద్ర ప్రభుత్వం క్రింద పనిచేసే ఆర్కియా లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిరక్షణ నిర్వహణలో ఈ కట్టడం ఉంది.అది యాత్రికుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పొందడంలో చూపిస్తున్న శ్రద్ధ కట్టడా పరిరక్షణలో చూపించడం లేదు.2010లో కోస్టల్ కంపెనీ దేవాదుల సొరంగం తవ్వకాలు చేపట్టిన తరుణంలో అది పేల్చిన బాంబుల కారణంగా రామప్ప దేవాలయం గోడలు బీటలు వారిన విషయం తెలిసిందే.

ఈ విధ్వంసాన్ని అతి విషాదకరంగా పలు పత్రికలు ప్రపంచవానికి వెల్లడి చేసిన ఏఎస్ఐ అంతగా ప్రతి స్పందించలేదని విమర్శలు కూడా వచ్చాయి.దీనివల్ల కళాకారులు రచయితలు సామాజిక ఉద్యమకారులు ప్రజా సంఘాల వారు రామప్ప పరిరక్షణ కమిటీగా ఏర్పడి ఆందోళనలు కూడా చేశారు.

ఆ తర్వాత మళ్లీ రామప్ప గుడి చుట్టూ 20 కిలోమీటర్ల దూరంలో వెంకటాపురం, నల్లగొండ, పెద్దాపురం లాంటి గ్రామాల పరిధిలో ఓపెన్ కాస్ట్ తవ్వకాలు జరపడానికి సంవత్సరానికి మూడు పంటలు పండే పంట పొలాలను సర్వే చేసి స్వాధీనం చేసుకునే దిశగా సింగరేణి ఉండగా రామప్ప పరిరక్షణ కమిటీ రంగంలోకి దిగింది.

Telugu Bhakti, Devotional, Cast, Ramappa Temple, Singareni, Telangana, Warangal,

ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లా ఉన్నత అధికారుల దృష్టికి తెచ్చి సింగరేణి కంపెనీ అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడు సద్దుమనిగెల చేశారు.అంతేకాకుండా సంవత్సరం క్రితం మళ్లీ ఓపెన్ కాస్ట్ తవ్వకాలు ప్రారంభం అవుతున్నాయని అనే వార్త తెరపైకి వచ్చింది.రామప్ప పరిరక్షణ కమిటీ ఇతర ప్రజా సంఘాలు తిరిగి ఆందోళన వ్యక్తం చేయడంతో సింగరేణి కంపెనీ యాజమాన్యం రామప్ప దేవాలయ పరిసరాల్లో ఓపెన్ కాస్ట్ చెయ్యమని మీడియా ముందు హామీ ఇచ్చింది.

అయితే మళ్లీ రామప్ప దేవాలయానికి ఓపెన్ ముప్పు రానుందని పరిసర గ్రామాల్లో సింగరేణి అధికారులు ఓపెన్ కాస్ట్ కు సంబంధించిన సర్వేలు చేస్తున్నారని విషయం బయటకు వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube