అక్కడ వీర సింహారెడ్డి కుమ్మేస్తున్నాడు.. వాల్తేరు వీరయ్య ఇక్కడ!

మెగా స్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ లు ఈ సంక్రాంతి కి బాక్సాఫీస్ వద్ద పెద్ద యుద్ధమే చేయబోతున్నారు.వారి నటించిన వాల్తేరు వీరయ్య మరియు వీర సింహా రెడ్డి సినిమా లు ఒక్క రోజు తేడా తో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

 Waltair Veerayya And Veerasimha Reddy Movie Advance Booking News, Waltair Veeray-TeluguStop.com

ఈ రెండు సినిమా లను కూడా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించగా, శృతి హాసన్ ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.వాల్తేరు వీరయ్య సినిమా కు బాబీ దర్శకత్వం వహించగా.

వీర సింహా రెడ్డి సినిమా కు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు.ఈ రెండు సినిమా లు కూడా మాస్ ఆడియన్స్ కి పూనకాలు తెప్పించే విధంగా ఉండబోతున్నాయి అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

ఇక ఈ రెండు సినిమా లను తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేసినట్లుగానే అమెరికా మరియు ఆస్ట్రేలియా యూకే లో కూడా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.ఇప్పటికే అక్కడ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం అయ్యాయి.

తాజాగా అందిస్తున్న సమాచారం ప్రకారం ఆ మూడు దేశాల్లో కూడా ప్రస్తుతానికి వీర సింహా రెడ్డి సినిమా అడ్వాన్స్ బుకింగ్ లో ముందు ఉన్నట్లు సమాచారం అందుతుంది.తెలుగు రాష్ట్రాల్లో మాత్రం క్లియర్ గా వాల్తేరు వీరయ్య యొక్క డామినేషన్ కనిపిస్తోంది.

బాలకృష్ణ అభిమానులు అక్కడ నాన్న రచ్చ చేసేందుకు అడ్వాన్స్ బుకింగ్ తోనే తమ సత్తా ఏంటో చూపిస్తున్నారు.ఇక మెగా అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి కి భారీ గా చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య కు కలెక్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది.

మొత్తానికి ఈ రెండు సినిమా ల మధ్య అక్కడ ఇక్కడ పోటీ తీవ్రంగానే ఉండబోతున్నాయని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube