మీ జాతకంలో శని దోషం ఉందా.. అయితే ఈ పరిహారాలు మీకోసమే..!

గ్రహాల కదలిక ప్రతి ఒక్కరి పై ప్రభావం చూపిస్తూ ఉంటుంది.మనం చేసే మంచి, చెడులను బట్టి శని దేవుడు( Shanidev ) ఫలితాలను ఇస్తూ ఉంటాడు.

 Follow These Remedies If You Are Having Shani Dosham Details, Remedies , Shani-TeluguStop.com

అందుకోసమే ఎప్పుడూ మంచి పనులను చేస్తూ ఉండాలి.అందుకే ఆయనను న్యాయ దేవుడు, కర్మదాత అని చాలా మంది ప్రజలు పిలుస్తూ ఉంటారు.

ముఖ్యంగా చెప్పాలంటే శని దేవుడి అనుగ్రహం ఉంటే వారు కింగ్ లాగా బ్రతుకుతారు.ఒక వేళ శని చెడు దృష్టి పడితే జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు.

ప్రస్తుతం శని దేవుడు తన సొంత రాశి కుంభ రాశిలో( Aquarius ) ఉన్నాడు.

ఇదే రాశి లోకి జూన్ 17న శని తిరుగమనం చేసింది.శని రివర్స్ కదలిక వల్ల మేషం, కర్కాటకం, కన్య, వృశ్చిక రాశుల వారి పై చెడు ప్రభావం పడుతుంది.ఈ సమయంలో శని దేవుడు వీరికి కష్టాలను తీసుకొస్తాడు.

అయితే శని చెడు దృష్టి పడకుండా ఉండాలంటే కొన్ని నివారణ చర్యలు కచ్చితంగా తీసుకోవాలి.శనీశ్వరుడి కోపం తగ్గించాలంటే రోజు మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి.

అలాగే నిత్యం హనుమంతుడిని పూజించడం( Hanuman Pooja ) వల్ల కూడా మీ పై ప్రతికూల ప్రభావం అంతగా ఉండదు.

ఈ సమయంలో మీరు డబ్బు, ఆహారం, బట్టలు దానం చేస్తే మంచిది అని పండితులు చెబుతున్నారు.దీని వల్ల శని దేవుడు సంతోషించి కోరికలన్నీ తీరుస్తాడు.అంతే కాకుండా మీ జాతకంలో శని దోషం ఉంటే ప్రతి రోజు కాకులకు రొట్టెలు తినిపిస్తూ ఉండాలి.

అలాగే మీకు వీలైనంతలో దానం చేస్తూ ఉండడం ఎంతో మంచిది.ఇంకా చెప్పాలంటే శని దేవుడికి ఇష్టమైన శనివారం రోజు ( Saturday ) ఈ పరిహారాలు చేస్తే శని దేవుడు సంతోషించి మీ పై చెడు ప్రభావాన్ని దూరం చేస్తాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube