విజయవాడ ఎంపీ కేశినేని నాని( MP Kesineni Nani ) టీడీపీ అధినేత చంద్రబాబుపై( Chandrababu ) సీరియస్ వ్యాఖ్యలు చేశారు.అప్పట్లో ఏబీ వెంకటేశ్వరరావుతో ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు.
ఇలాంటివి చంద్రబాబుకి బాగా అలవాటని వ్యాఖ్యానించారు.శనివారం కేశినేని నాని ప్రముఖ మీడియాతో మాట్లాడారు.
గతంలో తన ఫోన్ ను మోదీ ట్యాపింగ్ చేయించారని ఆరోపించి.ఇప్పుడు అదే మోదీతో( Modi ) చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు.
ప్రస్తుతం చంద్రబాబు ఎన్డీఏలో( NDA ) ఉన్నారుగా.దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరిపించాలని సవాల్ చేశారు.2018 నుంచి తన ఫోన్ ట్యాపింగ్ కి( Phone Tapping ) గురికావడం జరిగింది.అయినా కానీ నాకు ఎలాంటి భయం లేదు.
సీఎం జగన్ కి నాకు ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు.
![Telugu Chandrababu, Devineni Uma, Nda Alliance-Latest News - Telugu Telugu Chandrababu, Devineni Uma, Nda Alliance-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/03/MP-Kesineni-Nani-serious-comments-on-Chandrababu-detailss.jpg)
ఫోన్ ట్యాప్ చేయటానికి కానిస్టేబుల్ ని పంపిస్తారా.? చంద్రబాబు హైదరాబాదులో ఉండి ఫోన్ ట్యాప్ చేయిస్తున్నారు అని కేశినేని నాని ఆరోపించారు.ఇదే సమయంలో విజయవాడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నేరచరిత్ర కలిగిన వ్యక్తి.
ఆయన భూకబ్జాలు, చీటింగ్, నేరచరిత్ర లపై త్వరలో పుస్తకాలు వస్తాయి.విశాఖలో డ్రగ్స్( Visakha Drugs ) తెప్పించింది చంద్రబాబుకి సంబంధించిన వాళ్లే.
ఈ ఎన్నికలలో లోఫర్లు మరియు చీటర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు తెలుగుదేశం పార్టీ టికెట్లు ఇచ్చింది.దేవినేని ఉమా చాప్టర్ క్లోజ్ అయింది.100 కోట్లకు చంద్రబాబు ఆ సీటు అమ్మేశాడని దేవినేని ఉమానే చెప్పారు అని ఎంపీ కేశినేని నాని సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.