తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఆర్మూరు నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్( Minister KTR ) ప్రచార రథం పైనుంచి పడబోయిన సంగతి తెలిసిందే.ఆర్మూరు నియోజకవర్గంలో పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో జీవన్ రెడ్డి, ఎంపీ సురేష్ రెడ్డి లతోపాటు ప్రచార రథం పై ర్యాలీలో కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ క్రమంలో వాహనం స్పీడ్ గా వెళుతున్న సమయంలో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశారు.దీంతో ప్రచార రథంపై కేటీఆర్ ఇంకా జీవన్ రెడ్డి( Jeevan Reddy ) మినహా ఇతర నేతలు కింద పడటంతో స్వల్పంగా గాయాలయ్యాయి.
మంత్రి కేటీఆర్ భద్రతా సిబ్బంది అలర్ట్ కావటంతో పెను ప్రమాదం తప్పింది.ప్రచార రథం పై నుండి కింద పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకోగలిగారు.
ఓపెన్ టాప్ వెహికల్ కావటంతో ముందుకు పడిపోయే పరిస్థితి నుండి కేటీఆర్ తప్పించుకోగలిగారు.

కానీ స్వల్పంగా గాయాలయ్యాయి.ఈ క్రమంలో కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో( Ktr Elections Rally ) జరిగిన ప్రమాదం పై చాలా మంది సోషల్ మీడియాలో.స్పందించి జాగ్రత్తలు చెప్పడం జరిగింది.ఈ సందర్భంగా తన గాయం పై జరిగిన ప్రమాదంపై కేటీఆర్ ట్విట్టర్ లో రియాక్ట్ అయ్యారు.“నేడు ఆర్మూరులో( Armur ) జరిగిన ఘోర ప్రమాదం పై ఆందోళన వ్యక్తం చేస్తూ సందేశాలు పంపిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.కాలు మీద రెండు చిన్న గాయాలు తప్ప నేను బాగానే ఉన్నాను.ఆ తర్వాత కొడంగల్ లో ప్రచారాన్ని కొనసాగిస్తున్నాం” అని ప్రతి ఒక్కరికి కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు.







