రాష్ట్రంలో ఎన్నికలు ఏ క్షణమైనా రావచ్చు అని డిప్యూటీ సీఎం రాజన్న దొర( Deputy CM Rajannadora ) కీలక వ్యాఖ్యలు చేశారు.పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన ఆయన ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
మళ్లీ జగన్ ముఖ్యమంత్రి( CM Jagan ) అయ్యే రీతిలో రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తున్నట్లు స్పష్టం చేశారు.ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని విపక్షాలు అంటున్నాయి.
ఇదే సమయంలో సీఎం జగన్ సైతం పార్టీ నేతలతో సమీక్ష సమావేశలలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని అలర్ట్ చేస్తున్నారు.
పరిస్థితి ఇలా ఉండగా ముందస్తు ఎన్నికల విషయంలో.ఈ ఒక్క సారి మాత్రమే కాదు ఈ ఏడాది మే నెలలో సైతం డిసెంబర్ లేదా జనవరిలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని డిప్యూటీ సిఎం రాజన్న దొర కామెంట్లు చేయడం జరిగింది.మరోసారి ఇదే రీతిలో ఇప్పుడు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని రాజన్న దొర చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలు( AP Politics ) ఆసక్తికరంగా మారాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారం అయితే వచ్చే ఏడాది మే నెలలో ఎన్నికలు జరగాలి.అయితే ముందస్తుకు వెళ్లే అవకాశం ఉంటే తెలంగాణతో పాటు ఏపీలో కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తాజా వార్తలపై విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.