టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో సూపర్ స్టార్ గా నయనతార( Nayanthara ) పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే.నయన్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా ఆమెను అభిమానించే వాళ్ల సంఖ్య సైతం అంతకంతకూ పెరుగుతోంది.
నయనతార లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించినా ఆ సినిమాలు సక్సెస్ సాధిస్తూ నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తున్నాయి.
అయితే నయనతారను లేడీ సూపర్ స్టార్ గా( Lady Superstar ) అంగీకరించలేమంటూ తాజాగా కస్తూరి షాకింగ్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.
నయనతారను సూపర్ స్టార్ గా అంగీకరించలేమని కస్తూరి అభిప్రాయం వ్యక్తం చేశారు.గతంలో పలువురు సెలబ్రిటీల గురించి విమర్శలు చేసిన కస్తూరి ప్రస్తుతం నయనతారను టార్గెట్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచే కస్తూరి( Kasturi ) సౌత్ ఇండియాలో నయన్ ను లేడీ సూపర్ స్టార్ గా అంగీకరించలేమని అన్నారు.తమిళనాట రజనీకాంత్( Rajinikanth ) బిగ్గెస్ట్ స్టార్ అని అక్కడ ఎంతమంది హీరోలు ఉన్నా రజనీకాంత్ ను భర్తీ చేయడం మాత్రం అసాధ్యమని కస్తూరి అన్నారు.కేపీ సుందరాంబల్, విజయశాంతి మాత్రమే లేడీ సూపర్ స్టార్లు అని కస్తూరి కామెంట్లు చేయడం గమనార్హం.
నయనతార సరోగసి ద్వారా పిల్లల్ని కనడంతో గతంలో కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.అయితే కస్తూరిపై నయనతార ఫ్యాన్స్ మాత్రం ఫైర్ అవుతున్నారు.ఆమెను ఇంతలా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముందని వాళ్లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
కస్తూరి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే బాగుంటుందని కొంతమంది చెబుతున్నారు.కస్తూరి ప్రస్తుతం పలు బుల్లితెర సీరియల్స్ తో బిజీగా ఉన్నారు.
కస్తూరిని అభిమానించే వాళ్ల సంఖ్య మాత్రం అంతకంతకూ పెరుగుతోంది.కస్తూరి రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం.