అనంతపురం జిల్లాలోని కేంద్రీయ విద్యాలయంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.విద్యార్థినులను వేధిస్తున్నాడంటూ లైబ్రేరియన్ పై దాడి చేశారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే వేధిస్తున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో విద్యార్థినుల తల్లిదండ్రులు లైబ్రేరియన్ పై దాడికి పాల్పడ్డారు.గత కొన్ని రోజులుగా లైబ్రేరియన్ విద్యార్థులను వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
దీనిపై గతంలో ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపణలు చేస్తున్నారు.తల్లిదండ్రుల ఆందోళనలతో అనంతపురం కేంద్రీయ విద్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.