తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అధ్యక్షతన మొదటి క్యాబినెట్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆరు గ్యారెంటీ లపై సుదీర్ఘంగా చర్చించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.ఈ క్రమంలో సోనియా జన్మదినోత్సవం నాడు డిసెంబర్ 9వ తారీకు రెండు గ్యారెంటీలు అమల్లోకి తీసుకు వస్తున్నట్లు తెలిపారు.

మిగిలిన నాలుగు గ్యారెంటీ లపై చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు ( Minister Sridhar Babu )మీడియాతో వెల్లడించారు.మొదటి గ్యారెంటీ మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం.రెండవ గ్యారెంటీ రాజు ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయలకు పెంపు.ఇక ఇదే సమయంలో ఎల్లుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలిపారు.ఆ సమయంలో ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు స్పష్టం చేశారు.2014 నుంచి 2023 వరకు ప్రభుత్వ శాఖల ఖర్చులపై కూడా చర్చించినట్లు పేర్కొన్నారు.రాష్ట్ర ఆర్థిక ఖజానా పరిస్థితి ప్రజలకు తెలియాలని ఆదాయ, వ్యయాలపై.శ్వేత పత్రం విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.ఇదే సమయంలో గెలిపించిన తెలంగాణ ప్రజలకు మంత్రి శ్రీధర్ బాబు కృతజ్ఞతలు తెలియజేశారు.







