ఏపీలో మరో పాతిక రోజుల్లో పోలింగ్ జరగనుంది.నిన్నటి నుండి నామినేషన్ ప్రక్రియ మొదలైంది.
ఇప్పటికే పలు పార్టీలకు చెందిన పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది.జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఈసారి పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.
నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో( Chandrababu ) కలసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.కాగా తాజాగా పవన్ కళ్యాణ్ కొత్త ప్రచార షెడ్యూల్ విడుదల కావడం జరిగింది.ఈనెల 20వ తారీఖున పిఠాపురం( Pithapuram ) నుంచి మొదలయ్యే ఎన్నికల షెడ్యూల్.22 రోజుల పాటు కొనసాగుతుందని తెలియజేశారు.
21న భీమవరం, నరసాపురం, 22న తాడేపల్లిగూడెంలో( Tadepalligudem ) పర్యటించనున్నారు.23న పిఠాపురంలో నామినేషన్ వేయనున్నారు.నామినేషన్ తర్వాత పవన్ పలు నియోజకవర్గాల్లో బహిరంగ సభలో పాల్గొననున్నారు.అనంతరం మే 10వ తారీఖున మరోసారి పిఠాపురంలో రోడ్ షో చేసి అక్కడ సభలో ప్రసంగించనున్నారు.మే 11వ తేదీన కాకినాడ రూరల్ లో( Kakinada Rural ) రోడ్ షోతో… పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ముగియనుంది.2019 ఎన్నికలలో పవన్ భీమవరం, గాజువాక నుండి పోటీ చేసి ఓడిపోయారు.అయితే ఈసారి పిఠాపురం నుండి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు.2024 ఎన్నికలను పవన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.