పవన్ కళ్యాణ్ కొత్త ఎన్నికల షెడ్యూల్..!!

ఏపీలో మరో పాతిక రోజుల్లో పోలింగ్ జరగనుంది.నిన్నటి నుండి నామినేషన్ ప్రక్రియ మొదలైంది.

ఇప్పటికే పలు పార్టీలకు చెందిన పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఈసారి పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.

నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో( Chandrababu ) కలసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

కాగా తాజాగా పవన్ కళ్యాణ్ కొత్త ప్రచార షెడ్యూల్ విడుదల కావడం జరిగింది.

ఈనెల 20వ తారీఖున పిఠాపురం( Pithapuram ) నుంచి మొదలయ్యే ఎన్నికల షెడ్యూల్.

22 రోజుల పాటు కొనసాగుతుందని తెలియజేశారు. """/" / 21న భీమవరం, నరసాపురం, 22న తాడేపల్లిగూడెంలో( Tadepalligudem ) పర్యటించనున్నారు.

23న పిఠాపురంలో నామినేషన్ వేయనున్నారు.నామినేషన్ తర్వాత పవన్ పలు నియోజకవర్గాల్లో బహిరంగ సభలో పాల్గొననున్నారు.

అనంతరం మే 10వ తారీఖున మరోసారి పిఠాపురంలో రోడ్ షో చేసి అక్కడ సభలో ప్రసంగించనున్నారు.

మే 11వ తేదీన కాకినాడ రూరల్ లో( Kakinada Rural ) రోడ్ షోతో.

పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ముగియనుంది.2019 ఎన్నికలలో పవన్ భీమవరం, గాజువాక నుండి పోటీ చేసి ఓడిపోయారు.

అయితే ఈసారి పిఠాపురం నుండి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు.

2024 ఎన్నికలను పవన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

వైరల్ వీడియో: ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన సీఎం, డిప్యూటీ సీఎం..