అసెంబ్లీ సాక్షిగా అద్భుతం.. అలింగనం చేసుకున్న ఈటల-కేటీఆర్.. 10ని"చర్చ.!!

తెలంగాణ అసెంబ్లీ( Telangana Assembly ) వర్షాకాల సమావేశాలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.ఇవే చివరి సమావేశాలు కావచ్చు.

 Ktr Spoke With Etela In The Assembly, Telangana Assembly , Etela Rajender , Ktr-TeluguStop.com

దీంతో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి ఎంట్రీ ఇవ్వడంతో పండగ వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగానే ఒక అనూహ్య ఘటన చోటు చేసుకుంది.

అసెంబ్లీలో మంత్రి కేటీఆర్( Ktr ), బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్( Etela Rajender ) సీటు వద్దకు వెళ్లి ఎంతో ఆప్యాయంగా పలకరించి, ఆలింగనం చేసుకున్నారు.ఒకరినొకరు చేతిలో చేయి వేసుకొని చాలా సంతోషంగా నవ్వుకుంటూ 10 నిమిషాల పాటు చర్చించుకున్నారు.అనంతరం సమావేశం మొదలైంది.ముందుగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ ప్రముఖ గాయకుడు సాయి చందు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు నివాళులర్పించారు
.

సాయన్న మృతికి ముఖ్యమంత్రి కేసీఆర్ ( Kcr ) సభలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ సాయన్న లేని లోటు తీరనిదని, కంటోన్మెంట్ జిహెచ్ఎంసి లో కలపాలని దానికోసం ఆయన ఎంతో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు.సాయన్న అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన నాయకుడని తెలిపారు.సాయన్న కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.అలాగే మిగిలిన సభ్యులు కూడా సాయన్న( Sayanna ) మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకున్నారు.అంతేకాకుండా ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా కేటీఆర్ ను కలిశారు.

వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి అభివృద్ధి పనుల గురించి చర్చించారట.ఈ విధంగా అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఘటనలు చోటు చేసుకోవడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube