వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) కేరళలోని వయనాడ్( Wayanad ) నుంచి మళ్లీ పోటీ చేస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత కె.మురళీధరన్ తెలిపారు.
కన్నూర్ మినహా రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాలలో సిట్టింగ్ ఎంపీలే పోటీ చేసే అవకాశాలున్నాయని వెల్లడించారు.ఇక ఇదే సమయంలో ఇండియా కూటమిలో విభేదాలపై మురళీధరన్ స్పందించారు.అదేవిధంగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కూటమిలో చేరతారో లేదో తుది నిర్ణయం ఆయనదే అని స్పష్టం చేశారు.2014 సార్వత్రిక ఎన్నికలలో ఓటమి చెందిన తర్వాత కాంగ్రెస్ పార్టీ( Congress Party ) గ్రాఫ్ పడిపోయింది.ఆ తర్వాత 2019 ఎన్నికలలో కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
కానీ ఈసారి జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ ( Congress Party ) గతంలో కంటే అత్యధిక స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.రాహుల్ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీకి మంచి బూస్ట్ ఇచ్చింది.రాహుల్ “భారత్ జోడో” యాత్ర( Bharat Jodo Yatra ) తరువాత దేశంలో కాంగ్రెస్ గ్రాఫ్ అమాంతం పెరిగింది.
దీంతో ఈసారి జరగబోయే ఎన్నికలను కాంగ్రెస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది.ఆల్రెడీ దేశంలో కొన్ని బలమైన ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ “ఇండియా” కూటమి( India Alliance ) ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ క్రమంలో 2019 మాదిరిగానే 2024 పార్లమెంటు ఎన్నికలలో( 2024 Parliament Elections ) గతంలో పోటీ చేసి గెలిచిన వయనాడ్ నుంచే రాహుల్ పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు.