ఆగస్టు నెలలో జరుపుకునే పండుగలు పర్వదినాల పూర్తి వివరాలు ఇవే..!

తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది ఆగస్టు నెల వివిధ పండుగలకు అంకితం చేయబడిందని పండితులు చెబుతున్నారు.శ్రావణమాసంలో వ్రతాలు, పర్వదినాలు, శుభకార్యాలు జరుపుకుంటారు.

 These Are The Complete Details Of The Festivals Celebrated In The Month Of Augus-TeluguStop.com

ఈ సంవత్సరం అధిక శ్రావణం కూడా రావడంతో మొత్తం 60 రోజులు శ్రావణమాసంలో జరుపుకోనున్నారు.ఆగస్టు మాసంలో శ్రావణ సోమవారం, మంగళవారం, శుక్రవారం ఆచరిస్తారు.

శ్రావణ మాసంలో ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును( Lord Vishnu ) ఆరాధించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.ముఖ్యంగా చెప్పాలంటే ఆగస్టు నెలలోని పండుగలు, పర్వదినాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Bhakti, Devotional, Festivals, Naga Panchami, Rakhi, Sravanamasam-Latest

హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం శ్రావణమాసంలోనీ శుక్లపక్షంలో వచ్చే నాగ పంచమి( Naga Panchami ) పండుగను ఆగస్టు 21 2023న జరుపుకుంటారు.పంచాంగం ప్రకారం ఈ ఏడాది శ్రావణ మాసంలోని శుక్లపక్ష పంచమి తిధి ఉదయం 5.53 నిమిషముల నుంచి 8:30 వరకు ఉంటుంది.ఈ సమయం పూజించడానికి అనుకూలమైనదని పండితులు చెబుతున్నారు.

హిందూ మతానికి సంబంధించిన సోదరీమణులు సంవత్సరం పొడుగునా వేచి చూసే రాఖీ( Rakhi ) పండుగను ఈ సంవత్సరం ఆగస్టు 30 2023న జరుపుకొనున్నారు.పంచాంగం ప్రకారం ఈ పండుగ ప్రతి సంవత్సరం శ్రావణమాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు.

Telugu Bhakti, Devotional, Festivals, Naga Panchami, Rakhi, Sravanamasam-Latest

ఈ సంవత్సరం సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టే శుభసమయం ఆగస్టు 30 2023 ఉదయం 9 గంటల ఒక నిమిషం తర్వాత మొదలవుతుంది.ఇంకా చెప్పాలంటే ఆగస్టు 4వ తేదీన శుక్రవారం అధిక శ్రావణమాసం విభువన సంకాష్టహర చతుర్థి కృష్ణ చవితి( Sankashtahara Chaturthi ).అలాగే ఆగస్టు 12న శనివారం రోజు అధిక శ్రావణమాసం పరమ ఏకాదశి.ఆగస్టు 13 న ఆదివారం రోజు అధిక శ్రావణమాసం, అధిక ప్రదోష వ్రతం, కృష్ణ త్రయోదశి.

అలాగే ఆగస్టు 25 వ తేదీ శుక్రవారం రోజు నిజ శ్రావణమాసం, వరలక్ష్మి వ్రతం.అలాగే ఆగస్టు 27 న ఆదివారం రోజు నిజ శ్రావణమాసం, శ్రావణ పుత్రాద ఏకాదశి.

ఆగస్టు 28వ తేదీన సోమవారం రోజు శ్రావణము, శుక్ల ద్వాదశి, దామోదర ద్వాదశి.ఇంకా చెప్పాలంటే ఆగస్టు 28 సోమవారం శ్రావణము ప్రదోష వ్రతము.ఆగస్టు 30 బుధవారం శ్రావణ పౌర్ణమి, రక్షాబంధన్ హయగ్రీవ జయంతి.అంతేకాకుండా ఆగస్టు 31వ తేదీన గాయత్రి జయంతి, సంస్కృత దినం అని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube