శ్రీవారికి ఎంత బంగారం ఉందో చెప్పినా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో..!

వారణాసిలో జరిగిన అంతర్జాతీయ దేవాలయాల సమావేశంలో పాల్గొన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి( TTD EO Dharma Reddy ) తిరుమల కు చెందిన చాలా ఆసక్తికర సమాచారం వెల్లడించారు.తిరుమల తిరుపతి దేవస్థానం( TTD ) వివిధ శాఖల సిబ్బంది విధివిధానాలు, స్వామి వారికి ఎంత బంగారం ఉంది? ప్రసాదాలలో ఎంత నెయ్యి వినియోగిస్తారు వంటి అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈవో వెల్లడించారు.దేశవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం 71 దేవాలయాలను నిర్వహిస్తుందని ఈవో తెలిపారు.

 Tirupati Lord Venkateshwara Swamy Has Rs 17000 Crore Cash 11 Tonnes Of Gold Says-TeluguStop.com

శ్రీవారికి అలంకరించే బంగారు ఆభరణాలు 1.2 టన్నులు, వెండి 10 టన్నులు ఉంటుందని వివరించారు.ఏడాదికి శ్రీవారికి 500 టన్నుల పుష్పాలతో అలంకరణ చేస్తున్నట్లు వెల్లడించారు.

తిరుమల తిరుపతి దేవస్థానంలో 24500 మంది ఉద్యోగులు ఉండగా దేవాలయంలో భక్తులకు సేవలు అందించడానికి రోజుకు 800 మంది సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు.శ్రీవారి ఆలయంలో ప్రసాదాల తయారీకి ప్రతి సంవత్సరం 500 టన్నుల నెయ్యి వినియోగిస్తామని వెల్లడించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో 600 ఎకరాల అడవి ప్రాంతం ఉందని వెల్లడించారు.

Telugu Gold, Bhakti, Devotional, Mohan Bhagawat, Rs Crore Cash, Srivani, Tirupat

స్వామి పేరుతో 17 వేల కోట్ల నగదు, 11 టన్నుల బంగారం( 11 Tonnes Gold ) బ్యాంకులో డిపాజిట్ చేశామని వెల్లడించారు.అలాగే ఈ దేవస్థానంలో వివిధ శాఖల సిబ్బంది ఎలా పనిచేస్తారు, వారి విధివిధానాల గురించి కూడా వివరించారు.అంతర్జాతీయ దేవాలయ సమావేశం ఎగ్జిబిషన్‌లో 30 దేశాల నుంచి వచ్చిన 1600 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇంకా చెప్పాలంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్( RSS Chief Mohan Bhagawat ) శ్రీవాణి ట్రస్ట్ పై ప్రశంసలు కురిపించారు.

Telugu Gold, Bhakti, Devotional, Mohan Bhagawat, Rs Crore Cash, Srivani, Tirupat

శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా సేకరించిన నిధులతో ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలలో తిరుమల తిరుపతి దేవస్థానం దేవాలయాలు నిర్మించడంపై అభినందించారు.ఆలయాల ద్వారా హిందూ మత విలువలు తెలియజేయాలి అన్నారు.అలాగే మన సంస్కృతిని వివరించాలి.

దేవాలయాల ద్వారా విద్య, వైద్య సేవలను ప్రజలకు అందించాలి.పేదవారి వైద్యానికి దేవాలయాల నుంచి సహకారం అందించాలని మోహన్ భగవత్ కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube