గడపకి పసుపు ఎందుకు రాయాలి ? సైన్స్ ఏం చేబుతోంది ?

ఈమధ్యకాలంలో సీటిల్లో పట్టించుకోవడం లేదు కాని, ఇంటి గడపకు పసుపు రాసి ఉండటం ఓ ఆచారం.కాని ఇలాంటి పద్ధతులని కేవలం ఆచారంలా పరిచయం చేస్తే ఈ జెనరేషన్ వారు అస్సలు పట్టించుకోరు.

 Why Do Hindus Apply Turmeric On Threshold Of Houses-TeluguStop.com

దాన్ని ఓ మూఢనమ్మకంలా చూస్తారు.మన శాస్త్రాలు చెప్పిన ఆచారాలకి, మనుషులు సృష్టించుకున్న మూఢనమ్మకాలకి చాలా తేడా ఉంటుంది.

మన శాస్త్రాల్లో సైన్స్ ఉంది.ఆ శాస్త్రాలు చెప్పిన కొన్ని పద్ధతులు లేదా ఆచారాలు ఎదో ఊరికే చెప్పినవి కాదు, వాటి వెనుక శాస్త్రీయమైన కారణాలు కూడా ఉంటాయి.

మామిడి తోరణాలు ఎందుకు కడతారు అంటే అలకరణం కోసమే కాదు, మంచి గాలి కోసం.అరటి ఆకుల్లో ఎందుకు భోజనం చేయాలి అంటే శుభ్రత కోసం, పర్యావరణాన్ని రక్షించుకోవడం కోసం.

ఇలా మన ఆచారాల వెనుక సైన్స్ ఉంటుంది.గడపలకి పసుపు రాయడం వెనుక కూడా సైన్స్ ఉంది.

మామూలుగానైతే గడపకి పసుపెందుకు అంటే లక్ష్మీదేవి ఆశీస్సుల కోసం అని చెబుతారు లేదా పసుపు పవిత్రతకి చిహ్నం, ఇల్లు పవిత్రంగా ప్రశాంతంగా ఉండాలంటే గడపకి పసుపు రాయాలని అంటారు.మరికొందరు ఏం చెబుతారు అంటే గడప పవిత్రంగా ఉండాలి, పసుపు రాస్తే గడప తొక్కకుండా ఉంటారు అని.ఆడపిల్లలు గడపకి పసుపు రాస్తే మంచి భర్త వస్తాడని కూడా అంటారు.ఇలాంటి కారణాలు ఈ సైన్స్ యుగంలో చెబితే ఎవరు నమ్ముతారు.

అందుకే సైన్స్ పద్ధతిలోనే ఈ ఆచారాన్ని వివరించాలి.

పసుపులో యాంటి బ్యాక్టేరియాల్, యాంటి ఫంగల్, యాంటి ఇన్ఫెక్షన్ గుణాలు ఉంటాయని మనం పుస్తకాల్లో చదువుకున్నాం కదా.గడపకి పసుపు రాయడం వలన ఎన్నో క్రీములు కీటకాలు మన గడప దాటడానికి సాహసించవు.మనం సాధారణంగా చెప్పులని గడపకి దగ్గరలోనే విడుస్తాం.

ఆ చెప్పులతో పాటు బ్యాక్టీరియా ఇంటిదాకా వస్తుంది.కాని ఇంటి లోపాలకి రాకుండా అడ్డుకోవాలంటే పసుపు గడపకి రాయాలి.

దాంతో మనం చాలారాకలా ఇన్ఫెక్షన్స్ నుంచి ఇంట్లోవాళ్ళని కాపాడుకోవచ్చు.ఇదండీ .సైన్స్ ప్రకారం గడపకి పసుపు రాయడం వెనుక లాజిక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube