కార్తీక మాసం పండుగను మన దేశవ్యాప్తంగా దాదాపు చాలామంది ప్రజలు ఎంతో ఘనంగా వారి కుటుంబ సభ్యులందరితో కలిసి జరుపుకుంటున్నారు.ఈ కార్తీకమాసంలో ఎక్కువగా ఆడవారు కఠినమైన ఉపవాసలను పాటిస్తూ ఉంటారు.
అంతేకాకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించి పూజలు కూడా చేస్తూ ఉంటారు.కార్తీక మాసం దాదాపు చివరి వారం కావడంతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భక్తులతో రద్దీగా ఉంది.
ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు చాలా ప్రాంతాల నుంచి బారి సంఖ్యలో భక్తులు వచ్చారు.
శివాలయంలో, కార్తీక దీపారాధన చేస్తూ, దేవాలయంలో ఉన్న మండపంలో, కొండపై ఎక్కడ చూసినా భక్తులు ఎక్కువగా కనిపిస్తున్నారు.
దీనివల్ల స్వామివారి దర్శనానికి దాదాపు నాలుగు గంటల సమయం పడుతుంది.ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉందని దేవస్థాన అధికారులు చెబుతున్నారు.భక్తులు కార్తిక దీపాలను వెలిగించడానికి కొండపైన ప్రధాన ఆలయ ప్రాంగణం లో ప్రత్యేకమైన స్టాండ్లను కూడా ఆలయ సిబ్బంది ఏర్పాటు చేశారు.భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులను తీర్చుకుంటున్నారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి ఆదివారం వివిధ కైంకర్యాల ద్వారా దాదాపు కోటి 20 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు.ఇంకా చెప్పాలంటే కార్తీక మాసం లో చివరి వారంలో మన దేశవ్యాప్తంగా కూడా దేవాలయాలకు భక్తులు భారీ ఎత్తున వస్తున్నారు.
కార్తీకమాసం చివరి ఆదివారం కావడంతో యాదాద్రికి భక్తుల రద్దీ పెరిగిందని దేవస్థాన అధికారులు చెబుతున్నారు.

సాయంత్రం భక్తులు ఒక్కసారిగా తిరుగు ప్రయాణం కావడంతో జాతీయ రహదారి 163 పై ట్రాఫిక్ జాం ఏర్పడింది.యాదాద్రి కి వెళ్ళిన వాహనాలకు తో పాటు వరంగల్ నుంచి హైదరాబాద్ కు వచ్చే వాహనాలు ఒక్కసారిగా టోల్ ప్లాజా కు చేరుకోవడంతో దాదాపు ఒక కిలోమీటర్ వరకు వాహనాలు నిలబడిపోయాయి.టోల్ ప్లాజా అధికారులు ప్రత్యేకమైన కౌంటర్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.