గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే.మాజీ మంత్రి కొడాలి నాని ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు మరియు ఆయన తనయుడు లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.
చంద్రబాబు లేదా లోకేష్ ఎవరు తనతో గుడివాడలో పోటీపడిన కచ్చితంగా గెలుస్తానని వ్యాఖ్యానించారు.దీంతో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కొడాలి నానిపై పోటీకి తమ అధ్యక్షుడు చంద్రబాబు పోటీ చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.చంద్రబాబు, లోకేష్ దాకా ఎందుకు.దమ్ముంటే నాపై గెలిచి చూపించాలని రావి వెంకటేశ్వరరావు సవాల్ విసిరారు.మంగళవారం రావి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడటం జరిగింది.
ఈ సందర్భంగా బాబు మరియు లోకేష్ లపై నాని చేసిన వ్యాఖ్యలను ఖండించారు.ఇటీవల కిడ్నీ ఆపరేషన్ తో పాటు బ్రెయిన్ సర్జరీ కూడా కొడాలి నానికి జరిగినట్లు ఉందని సెటైర్లు వేశారు.

తొందరపడి ఇటువంటి నాయకులను ఎన్నుకున్నందుకు ప్రజలు తమ కర్మ అని భావిస్తున్నట్లు.చెప్పుకొచ్చారు.ఒక్క ఛాన్స్ అంటూ.ఎన్నికలలో పోటీ చేసిన జగన్ కి ఇదే చివరి చాన్స్ అని అన్నారు.అక్రమంగా సంపాదించిన డబ్బుతో వచ్చే ఎన్నికలలో కొడాలి నాని గెలవలేరని పేర్కొన్నారు.కొడాలి నాని అక్రమ సంపాదనకు సంబంధించిన పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని రావి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.







