హీరోలు తమ కొత్త సినిమాల కోసం సరికొత్తగా మేకోవర్ అవుతూ ఉండడం సహజమే.ప్రతీ సినిమాకు కొద్దిగా అయినా మార్పు ఉండకపోతే ప్రేక్షకులకు కూడా బోర్ గా అనిపిస్తుంది.
అందుకే తమ మేకోవర్ పై హీరోలు ఎక్కువ ద్రుష్టి పెడతారు.ఇక స్టార్ హీరోల గురించి అయితే చెప్పాల్సిన పని లేదు.
ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కూడా కొత్త లుక్ లోకి వచ్చేసాడు.
ట్రిపుల్ ఆర్ వంటి సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత తన 30వ సినిమా కోసం సిద్ధం అవుతున్నారు.
ఇక ఈ క్రమంలోనే తారక్ ఒక యాడ్ షూట్ లో ప్రెజెంట్ బిజీగా ఉన్నాడు.ఒక ఫుడ్ సంస్థకు చెందిన యాడ్ లో తారక్ నటించ బోతున్నాడు.
ఈ రోజు ప్రముఖ అడ్వార్టైజింగ్ మరియు సెలెబ్రిటీ ఫోటో గ్రాఫర్ అవినాష్ గోవారికర్ తన సోషల్ మీడియా ద్వారా తారక్ కొత్త లుక్ ను షేర్ చేసాడు.
జూనియర్ ఎన్టీఆర్ క్లాసీ లుక్ లో సూపర్ స్టైలిష్ గా ఉన్న ఫోటోలను షేర్ చేసాడు.
బ్లాక్ సూట్ లో ఎన్టీఆర్ గ్లాసెస్ పెట్టుకుని కొత్త లుక్ లో అదరగొట్టాడు అనే చెప్పాలి.ఈ క్లాసీ లుక్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక ఎన్టీఆర్ 30వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.ఇక ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.ఎన్టీఆర్ ఆర్ట్స్ ఇంకా యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మితం అవుతుంది.
చూడాలి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో.ఎప్పుడు రిలీజ్ అవుతుందో.