బ్రేక్ దర్శనం టికెట్స్ సులభంగా పొందడానికి..అందుబాటులోకి వచ్చిన కొత్త విధానం..!

ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల దేవస్థానానికి( TTD ) ప్రతి రోజు ఎన్నో లక్షల మంది భక్తులు తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు.

అలాగే కొంతమంది భక్తులు స్వామి వారికి కానుకలు చెల్లిస్తూ ఉంటారు.

ఇంకా చెప్పాలంటే మరికొంతమంది భక్తులు స్వామివారికి తల వెంట్రుకలను చెల్లించి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు.మన దేశవ్యాప్తంగా చాలామంది ప్రజలు ఇంకా స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.

ఇలాంటి భక్తుల కోసం తిరుమల దేవస్థానం బ్రేక్ దర్శనం టికెట్లను సులభంగా తీసుకునేలా కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.

ముఖ్యంగా చెప్పాలంటే తిరుమలలో ఆఫ్ లైన్ విధానంలో శ్రీవారి అర్జితా సేవలు బ్రేక్ దర్శనం పొందిన భక్తులు టికెట్లు పొందే ప్రక్రియను మరింత సులమంతరం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నూతన విధానాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది.పే లింక్ ఎస్ఎంఎస్ ద్వారా భక్తులు కౌంటర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లను ప్రింట్ తీసుకోవచ్చు.ఇంకా చెప్పాలంటే సిఆర్ఓలో లక్కీడిప్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లను భక్తులకు కేటాయిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

ఈ విధానంలో టికెట్లు పొందిన భక్తులు కౌంటర్ వద్దకు వచ్చి సొమ్ము చెల్లించి టికెట్లు పొందాల్సి ఉండేది.

కానీ నూతన విధానంలో ఎస్ఎంఎస్ ద్వారా పే లింకును పంపుతారు. భక్తులు( Devotees ) ఆ లింకు పై క్లిక్ చేసి యూపీఐ లేదా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డ్ ద్వారా ఆన్లైన్లో సొమ్ము చెల్లించి సేవ టికెట్లు ప్రింట్ తీసుకోవచ్చు.ఈ నూతన విధానాన్ని ప్రస్తుతం సిఆర్ఓలోనీ లక్కీ డిప్ కౌంటర్ల వద్ద ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.

త్వరలో ఎంబీసీ 34 కౌంటర్ వద్ద విచక్షణ కోటాలో కేటాయించే అర్జిత సేవా టికెట్లు, బ్రేక్ దర్శన టికెట్లకు కూడా ఈ విధానం అమలు చేస్తామని దేవాలయ ముఖ్య అధికారులు చెబుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే 2, గురువారం 2024
Advertisement

తాజా వార్తలు