మెగా డాటర్ నిహారిక కొణిదెల విడాకుల రచ్చ ఎప్పుడైతే మొదలైందో అప్పటినుంచి ఈమెను బాగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు జనాలు.ప్రతి ఒక్క విషయంలో టార్గెట్ చేసి ఆమెను సోషల్ మీడియాలలో వైరల్ చేస్తున్నారు.
ఇక రీసెంట్గా విడాకులు కూడా తీసుకోవటంతో జనాలు ఈమెను మరింత ఏకీపారేస్తున్నారు.మెగా ఫ్యామిలీ లో పుట్టి వారి పరువు తీశావు అని విమర్శిస్తున్నారు.
అయితే తాజాగా తను పంచుకున్న స్టోరీకి మరోసారి బాగా ట్రోల్స్ ఎదుర్కొంటుంది.ఇంతకు అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిహారిక మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో సినీ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం అయింది.కానీ హీరోయిన్గా ఆమెకు అంత సక్సెస్ రాలేకపోయింది.ముఖ్యంగా నటనపరంగా ఆమెకు టాలెంట్ లేదు అంటూ చాలామంది దర్శకుడు అవకాశాలు ఇవ్వటానికి కూడా ముందుకు రాలేదు.దీంతో నటిగా తనకు కూడా కలిసి రాదని అర్థమవడంతో తండ్రి సపోర్ట్ తో నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది.
అంతేకాకుండా జొన్నలగడ్డ చైతన్య ను పెళ్లి చేసుకొని పెళ్లి తర్వాత బాగా అతిగా ప్రవర్తించింది.ముఖ్యంగా తన వేషధారణ పూర్తిగా మారిపోయింది.ఒకప్పుడు ట్రెడిషనల్ లుక్ లో కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు మెగా వారి పరువు తీసే విధంగా బట్టలు వేస్తూ రచ్చ చేస్తుంది.అయితే పెళ్లయిన కొన్ని నెలల నుండి తనకు తన భర్తకు గొడవలు జరిగాయని ఆ మధ్య వార్తలు కూడా వినిపించాయి.
దీంతో సంవత్సరం నుండి వీరిద్దరు వెళ్ళిపోతున్నారని కూడా బాగా న్యూస్ ట్రెండ్ అయింది.ఇక వాళ్ళు విడిపోవడానికి అసలు కారణం ఏంటో తెలియలేదు కానీ నిహారిక ప్రవర్తన వల్ల, అంతేకాకుండా ఫ్రీడం అతిగా వాడుకోవడం వల్ల తన అత్తారింటి వాళ్లు తనను వద్దనుకున్నట్లు తెలిసిందని వార్తలైతే వచ్చాయి.
నిజానికి పెళ్లి తర్వాత నిహారిక లో చాలా మార్పులు అయితే వచ్చాయి.
ఇక రీసెంట్ గానే విడాకులు తీసుకుంటున్నామని సోషల్ మీడియా వేదికగా తెలుపగా కూకట్ పల్లి కోర్టు వీరి విడాకులను మంజూరు చేసింది.ఇక ఒంటరిగా ఉంటూ వెబ్ సిరీస్ లు చేయడమే కాకుండా ఫ్రెండ్స్ తో కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంది.అంతేకాకుండా ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోకుండా తనేంటో తాను చూసుకుంటూ పోతుంది.
అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఒక స్టోరీ పంచుకుంది.అందులో తన ఫ్రెండును హగ్ చేసుకుంటూ కనిపించగా పెళ్లి చేసుకోబోయే జంటలు ఫోటోషూట్ చేయించుకోవాలంటే తనను కాంటాక్ట్ అవ్వమంటూ సరదాగా పంచుకుంది.
దీంతో కొందరు ఆ స్టోరీని చూసి ఆమెపై విమర్శలు చేస్తున్నారు.అమ్మాయికి రొమాంటిక్ హగ్ ఇవ్వటం ఏంటి.అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం ఏంటి.భర్తతో ఇలా ఉంటే ఏమయ్యేది.
అందుకే అతడు నిన్ను వదిలేసాడేమో అని కామెంట్లు చేస్తున్నారు.