జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) దాదాపు రెండు రోజులపాటు ఢిల్లీలో ఇటీవల పర్యటించడం తెలిసిందే.ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ తర్వాత బీజేపీ పార్టీకి చెందిన పెద్దలతో సమావేశమయ్యారు.
ఆ తర్వాత ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ( Delhi ) నుండి గన్నవరంకి చేరుకున్నారు.ఆ తర్వాత మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో పంచకర్ల రమేష్ పార్టీలో జాయిన్ అయ్యే కార్యక్రమంలో పాల్గొని వాలంటీర్ల పై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో వాలంటీర్లకు నాయకుడు ఎవరని ప్రశ్నించారు.ప్రజల దగ్గర వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం.మూడు కంపెనీలకు వెళ్తుందని ఆరోపించారు.23 అంశాల సమాచారం సేకరించడానికి ప్రభుత్వ విధివిధానాలు ఏంటి.? వాలంటీర్లతో చేయకూడని పనులు చేయిస్తున్నారు.ఈ సమాచారం ప్రైవేటు సంస్థల సర్వర్ లో పెట్టుకోవడం నేరం.
వాలంటీర్లు( Volunteers ) ప్రమాదంలో ఉన్నారు.దీనిపై అమిత్ షాతో మాట్లాడాను.
ప్రభుత్వం వద్ద ఉండాల్సిన సమాచారం ప్రైవేటుపరం చేశారు.వాలంటీర్లకు నాయకుడు ఎవరు అధిపతి ఎవరు అని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.రెండో దశ వారాహి యాత్రలో వాలంటీర్ల పై పవన్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపడం తెలిసిందే.రాష్ట్రంలో వాలంటీర్లు మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
వాలంటీర్ల వ్యవస్థ పై పవన్ చేసిన వ్యాఖ్యలు పట్ల వైసిపి నాయకులు( YCP leaders ) మరియు ప్రజాప్రతినిధులు తీవ్రస్థాయిలో మండిపడటం జరిగింది.ఈ క్రమంలో ఢిల్లీ పర్యటన ముగించుకుని.
నేడు గన్నవరం చేరుకున్న పవన్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మరోసారి వాలంటీర్లపై వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.