రాజన్న సిరిసిల్ల జిల్లా🙁 Sirisilla District ) రెసిడెన్షియల్ పాఠశాలలోని విద్యార్థినీలకు క్రమం తప్పకుండా మెనూ ప్రకారం రుచి, శుచికరమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ( Anurag Jayanti )దేశించారు.గురువారం ఆయన గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పాఠశాలలో విద్యార్థినీల ఎన్ రోల్ మెంట్ ను అడిగి తెలుసుకున్నారు.వారికి అందిస్తున్న సౌకర్యాలు, వసతుల తీరును కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠశాలలో టాయిలెట్లు ఇతర పునరుద్ధరణ పనుల కోసం 9 లక్షల 70 వేల రూపాయలు మంజూరు అయ్యాయని, అట్టిపనులను ఎందుకు ఇంకా ప్రారంభించలేదని సంబంధిత ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నారు.
సంబంధిత ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమన్వయం చేసుకొని శుక్రవారం నుంచి పనులు ప్రారంభించాలని ఆదేశించారు.
పాఠశాలలో మొత్తం 590 మంది విద్యార్థినీలు విద్యను అభ్యసిస్తున్నారని ప్రిన్సిపాల్ కలెక్టర్ కు వివరించారు.కిచెన్, డైనింగ్ హాల్, డార్మెట్రీ లను కలెక్టర్ పరిశీలించారు.విద్యార్థినీలకు రుచి, శుచికరమైన భోజనం అందించాలని సూచించారు.సోలార్ వాటర్ హీటర్ లను మంజూరు చేస్తామని అన్నారు.
నీటి సరఫరా కోసం ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని ప్రిన్సిపాల్ ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ప్రస్తుతం మిషన్ భగీరథ ( Mission Bhagiratha )ద్వారా నిరంతరం నీటి సరఫరా ఉంటుందని, ఎప్పుడైనా అంతరాయం ఏర్పడితే నీటి సరఫరా అందించడానికి ప్రత్యామ్నాయంగా బోర్ ఉందని, దానికోసం మోటార్ ను మంజూరు చేయాలని ప్రిన్సిపాల్ కోరారు.