ప్రెగ్నెన్సీ సమయంలో మార్నింగ్ సిక్ నెస్ వేధిస్తోందా..? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

సాధారణంగా చాలామందికి గర్భధారణ( Pregnancy ) తర్వాత మొదటి మూడు నెలలు మార్నింగ్ సిక్ నెస్ వేధిస్తూ ఉంటుంది.అయితే గర్భధారణ సమయంలో ఇది సాధారణంగా తలెత్తే సమస్య అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

 Morning Sickness During Pregnancy These Precautions Are Mandatory ,pregnancy, He-TeluguStop.com

పగటివేల ఎప్పుడైనా కూడా ఇది తలెత్తవచ్చు.ఒక్కొక్కసారి ఇది తీవ్రంగా కూడా ఉంటుంది.

అయితే వికారం, వాంతులు, సీరియస్ ఫ్లూయిడ్ లాస్ లాంటివి కూడా జరుగుతాయి.అయితే దీనికి కారణం గర్భధారణకు ముందు సరైన శరీర బరువు 5% కంటే ఎక్కువ వెయిట్ లాస్( Weight loss ) అవ్వడం అని చెప్పవచ్చు.

ఇక చాలా మంది తల్లులు మార్నింగ్ సిక్ నెస్ ఫీలింగ్ ను అనుభవిస్తారు.ఇది హెచ్ సిజి పెరుగుదల కారణంగా వస్తుంది.

ప్రతిరోజూ స్త్రీలు రోజులో ఎప్పుడైనా కానీ వికారం, వాంతులు లాంటి లక్షణాలను ఎదుర్కొంటారు.

Telugu Tips, Pregnancy, Rusk Biscuits, Thyroid Hormone-Latest News - Telugu

మార్నింగ్ సిక్ నెస్ అధికమవడంలో థైరాయిడ్ హార్మోన్ల( Thyroid hormone ) పాత్ర కూడా ఉంటుంది.ఇక ఈ పరిస్థితి మూడవ నెల తర్వాత సాధారణంగా తగ్గిపోతుంది.నిజానికి శరీరంలో హార్మోన్ స్థాయిలో పెరగడం వలన వాంతులు, వికారం లాంటివి వస్తాయి.

అయితే ఇది ఆరోగ్యకరమైన గర్భానికి సంకేతం అని కూడా వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.అయితే ఈ పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పుడు కొన్ని చర్యలు తీసుకొని వీటిని నివారించవచ్చు.

రస్క్ లేదా బ్లాండ్ బిస్కెట్లను( Rusk Biscuits ) ఉదయాన్నే లేచిన ఐదు నిమిషాలకు బెడ్ పైనే కూర్చొని తినాలి.ఆ తర్వాత ఒక ఐదు నిమిషాలు వేచి ఉండి ఆ తర్వాత లేచి బ్రష్ చేయాలి.

ఇక ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీని అస్సలు తాగకూడదు.

Telugu Tips, Pregnancy, Rusk Biscuits, Thyroid Hormone-Latest News - Telugu

ఎందుకంటే ఇలా పడగడుపున టీ లేదా కాఫీ తాగడం వలన గుండెల్లో మంట, మార్నింగ్ సిక్ నెస్ కు దారితీస్తుంది.మూడు నుంచి నాలుగు గంటల విరామం ఇస్తూ భోజనం చేయాలి.

Telugu Tips, Pregnancy, Rusk Biscuits, Thyroid Hormone-Latest News - Telugu

ఇక ఆహారంలో మసాలా దినుసులను తగ్గించాలి.ఎందుకంటే ఇవి ఎసిడిటీనీ కలిగిస్తాయి.వికారాన్ని మరింత పెరిగేలా చేస్తాయి.ఇక తిన్న తర్వాత వెంటనే పడుకోకూడదు.10 నిమిషాల పాటు తేలికపాటి నడకను కొనసాగించాలి.ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.ఇక తిన్న తర్వాత లేదా అంతకుముందు మధ్య మధ్యలో జ్యూస్ లాంటివి తీసుకోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube