Somu Veerraju: వైసిపి నేతలు ఇటువంటి ఉద్యమం చేస్తే బిజెపి కూడా రోడ్డు మీదకు వస్తుంది - సోము వీర్రాజు

బిజెపి సోము వీర్రాజు. రాష్ట్రం లో మిత్ర పక్ష మైన జనసేన ఇళ్ల పధకానికి సంబంధించి సోషల్ ఆడిట్ చేశారు.

 Ap Bjp Chief Somu Veerraju Fires On Ycp Government Details, Ap Bjp Chief ,somu V-TeluguStop.com

వైసిపి కి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే లు గట్టిగా నిరోధించడాన్ని బిజెపి ఖండిస్తుంది.వైసిపి నేతలు ఇటువంటి ఉద్యమం చేస్తే బిజెపి కూడా రోడ్డు మీదకు వస్తుంది.ఇళ్ల‌ విషయం లో మోడీ ప్రభుత్వం 20లక్షల ఇళ్లు అర్బన్ లో.5లక్షల ఇళ్లు గ్రామంలో కేటాయించింది.ఒక్కో ఇంటికి లక్షా యనభై వేలు ఉచితంగా ఇచ్చాం.నిర్మాణం కోసం కేంద్రం 35వేల కోట్లు ఎపికి ఇవ్వడానికి సిద్ధం గా ఉంది.11వేల కోట్లు ఖర్చు చేశామంటున్న ప్రభుత్వం అవినీతి జరగలేదని‌ చెప్ప లేక పోతుంది.మేము 35వేల కోట్లు ఇస్తే… మీరు 11వేల కోట్లే ఖర్చు చేశారా.

మోడీ జగనన్న కాలనీలు అని పేరు పెట్టాలి కదా.కేంద్రం ఇచ్చిన డబ్బుకు మీ పేర్లే ఎందుకు.మిగతా ఇరవై కోట్లు కూడా ఖర్చు పెట్టి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి.పవన్ కళ్యాణ్ కార్యక్రమాన్ని నిరోధిస్తే సహించం.

ఆయన పై అసభ్య పదజాలం వాడటం సరి కాదు.చర్చిలకు 175కోట్లు అంట… ఎవడబ్బ సొమ్ము.

ప్రభుత్వం సొమ్ము చర్చిలకు ఎలా ఇస్తారు.మతతత్వ పార్టీ.

మతాలు తో రాజకీయం చేస్తుంది.ఈ ప్రభుత్వం బరి తెగించి వ్యవహరిస్తుంది.

వీటి పై మేము కోర్టు లో న్యాయ పోరాటం చేస్తాం.రొయ్యల రైతుల ఇబ్బందులు పరిష్కారించేలా చర్యలు తీసుకోవాలి.

మాకు ఎలాగూ కవరేజి ఇవ్వరు… మా మిత్ర పక్షం కార్యక్రమం కవరేజి తగ్గించేశారు.మీడియా ను మీ చేతుల్లో పెట్టుకుని ప్రచారం కల్పించరా.

వైసిపి, తెలుగుదేశం మిలాఖత్ అయ్యి రాజకీయం‌ చేస్తున్నాయి.ఏడు వేల కోట్లు ఏమయ్యాయో చంద్రబాబు ను జగన్ అడగాలి కదా.మైండ్ గేమ్ పాలిటిక్స్ తో పబ్బం గడుపుకుంటున్నారు.పొదుపు సంఘాల ఘనత చంద్రబాబు ది కాదు… పివి నరసింహారావు గారిది.

బిజెపి ఎంపి జీవియల్.రాష్ట్రం లో విచ్చలవిడిగా అవినీతి ‌జరుగుతుందని ఆధారాలతో‌ చెబుతూ ఉన్నాం.ప్రజాపోరు సభల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అవినీతి ని ప్రజలకు వివరించాం.వైసిపి వైఫల్యాలు, అవినీతి ని ఎండగడుతూ కార్యాచరణ సిద్దం చేశాం.

ఎక్కడిక్కడ పోరాటాలు చేసి, ప్రభుత్వం తీరు పై ఉద్యమిస్తాం.రాష్ట్రం లో బిజెపి ప్రత్యామ్నాయ శక్తి గా ఎదుగుతుంది.

గన్నవరం విమానాశ్రయం లో స్థానిక పోలీసులు తో రక్షణ ఎందుకు.టిడిపి, వైసిపి ప్రభుత్వం హయాంలో అనేక ఆరోపణలు వచ్చాయి.

కేంద్ర విమానయానశాఖ మంత్రి కి లేఖ రాశాను.cisf బలగాలు ఎయిర్పోర్ట్ లో ఎందుకు లేవు.

రాష్ట్రం లో రెండు వేల నోట్లు ఎందుకు కనిపించకుండా పోయాయి.ఆర్.

బి.ఐ ద్వారా విచారణ చేయాలని కోరతాం.జగన్ ప్రభుత్వం వైఫల్యం పై ఛార్జిషీట్ ప్రకటిస్తాం.టిడిపి కి సొంత ప్రయోనాలే తప్ప ప్రజల‌ ప్రయోజనాలు పట్టవు.

Telugu Ap Bjp, Chandrababu, Cmjagan, Jagananna, Janasena, Pawan Kalyan, Somu Vee

మోడీ విశాఖ పర్యటన తరువాత ప్రజల్లో మార్పు కనిపిస్తుంది.మా మిత్ర పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా ట్విట్టర్ ద్వారా ఇదే చెప్పారు.2024లో ఎపి లో మోడీ మ్యాజిక్ పని చేస్తుంది.బిజెపి, జనసేన భాగస్వామ్యం తో అధికారంలోకి వస్తాం.

పొలిటికల్ బ్లాక్ బస్టర్ 2024 లో రావడం ఖాయం.టిడిపి పూర్తి అభద్రతా భావంతో ఉంది.

వారిలో నాయకత్వం క్షీణిస్తుందని అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.నిరాశపరచిన గతం టిడిపి ది.భరించలేని ప్రస్తుతం వైసిపి ది.అందరూ ఎదురు‌ చూసే భవిష్యత్తు బిజెపి, జనసేనది.వైసిపి, టిడిపి లు రెండూ కుటుంబ పార్టీ లు, కుట్ర పార్టీ లు.నిజమైన ప్రత్యామ్నాయం ఒక్క బిజెపి తోనే సాధ్యం.రాష్ట్రం లో కాపులకు, బిసిలకు, ఎస్సీ,ఎస్టీలకు న్యాయం జరగడం లేదు.అన్ని వర్గాక వారికి న్యాయం చేయడం బిజెపి, జనసేన కూటమికే సాధ్యం.అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పించే కార్యాచరణ సిద్దం గా ఉంది.యనమల వంటి వారికే సీటు లేదని చంద్రబాబు అంటున్నారు.

వైసిపి లో కేవలం ఒక వర్గానికే పదవులు మొత్తం.వైసిపి కాదు… బిజెపి, జనసేన తోనే రాష్ట్ర భవితవ్యం.

అన్నమయ్య బ్యారేజి కొట్టుకు పోయి యేడాది అయినా జగన్ లో స్పందన లేదు.మా పార్టీ వాళ్లు ముందుగా వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు.

రాజకీయ పర్యటన గా జగన్ వెళ్లి వచ్చారు.ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఏ సాయం అందించారో చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube