ఈ మధ్య బుల్లితెర సీరియల్ నటీనటులకు వెండితెర నటినటులకు ఉన్నంత ఫాలోయింగ్ ఉంది.పైగా సీరియల్ నటులు సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటున్నారు.
ముఖ్యంగా యూట్యూబ్ లలో ఛానల్ క్రియేట్ చేసుకుని తెగ వీడియోలు షేర్ చేస్తూ మరింత అభిమానాన్ని పొందుతున్నారు.
అయితే ఈమధ్య ఒక బుల్లితెర జంట మాత్రం అందరి దృష్టిని తాకింది.
పైగా త్వరలో పెళ్లి చేసుకోబోయే జంట కాబట్టి బుల్లితెర ప్రేక్షకులు వారి వీడియోలను మిస్ కాకుండా చూస్తున్నారు.ఇంతకు ఆ జంట ఎవరో కాదు అమర్ దీప్, తేజస్విని గౌడ.
అయితే తాజాగా అమర్ తన కాబోయే భార్య బర్త్డే షాపింగ్ కి వెళ్లకుండా పారిపోయాడు.
ఇంతకూ అసలేం జరిగిందో తెలుసుకుందాం.
జానకి కలగనలేదు సీరియల్ హీరో అమర్ దీప్ చౌదరి గురించి అందరికీ పరిచయమే.ఆ సీరియల్ లో రామచంద్ర పాత్రలో నటించి మంచి అభిమానం సంపాదించుకున్నాడు.
ఈయన మొదట్లో ఉయ్యాల జంపాల, సిరిసిరిమువ్వలు వంటి పలు సీరియల్స్ లలో నటించాడు.
అంతేకాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించాడు.
అలా ప్రేక్షకులలో మంచి అభిమానం సంపాదించుకున్నాడు.ఇక ఈయన సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తాడు.
తనకు సంబంధించిన ఫోటోలను కూడా బాగా పంచుకుంటాడు.ఇక ఈయన తేజస్విని గౌడ తో ఇటీవలే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు.

కోయిలమ్మ, కేరాఫ్ అనసూయ సీరియల్లో నటించిన తేజస్విని గౌడ కూడా అందరికీ పరిచయమే.తేజస్వినికి కూడా బుల్లితెరపై మంచి పేరు ఉంది.వీరిద్దరు గత కొంతకాలం నుండి లవ్ చేసుకోగా ఆ మధ్యనే తమ కుటుంబ సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.మొత్తానికి ఇంతకాలం సీక్రెట్ లవ్ నడిపి పెళ్లి జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు.
ఎంగేజ్మెంట్ జరగక ముందు నుంచి వీరిద్దరు చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు.కానీ వీరి మధ్య లవ్ నడుస్తుంది అని ఎవరు కనిపెట్టలేకపోయారు.
అంతేకాకుండా ఇద్దరు కలిసి పలు షో లలో కూడా సందడి చేశారు.ఆ తర్వాత ఓసారి తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టారు.
ఎంగేజ్మెంట్ తర్వాత వీరిద్దరూ మరింత అన్యోన్యంగా కనిపిస్తున్నారు.

ఎటు చూసినా వీరిద్దరూ జంటగా తిరుగుతున్నారు.సోషల్ మీడియాలో వీడియో కాల్స్ ద్వారా తమ అభిమానులతో తెగ ముచ్చట్లు పెడుతున్నారు.ఇక తేజస్వికి యూట్యూబ్ ఛానల్ ఉండటంతో ప్రతి ఒక వీడియో ని షేర్ చేసుకుంటుంది.
అయితే తాజాగా తన కాబోయే భర్తతో తన బర్త్డే షాపింగ్ కు తీసుకొని వెళ్ళగా ఆ వీడియోను షేర్ చేసుకుంది.
ఇక షాపింగ్ మాల్ కి ఎంట్రీ ఇవ్వగా తేజస్వి తన వీడియో ద్వారా చేయబోయే షాపింగ్ గురించి చెబుతూ ఉండగా.
అక్కడే ఉన్న తన కాబోయే భర్త అమర్ తను వీడియో చేస్తుంది అని అక్కడి నుంచి పారిపోతూ కనిపించాడు.అంతేకాకుండా ముసుగు వేసుకొని కాసేపు వరకు కెమెరాకు కనిపించకుండా ఆటపట్టించాడు.
ఇక మధ్య మధ్యలో షాపింగ్ చేస్తూ బాగా కౌంటర్లు కూడా వేసుకున్నారు.ఇక ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.







