నందమూరి అభిమానులతో పాటు తెలుగు ఓటీటీ ప్రేక్షకులను కూడా ఎంతో అలరించిన బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 1 మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.అందుకే ఎక్కువ సమయం తీసుకోకుండా సీజన్ 2 ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేసారు.ఆహా ఓటీటీ వారు ఇప్పటికే మూడు ఎపిసోడ్స్ ని స్ట్రీమింగ్ చేయడం పూర్తి అయ్యింది.3 ఎపిసోడ్స్ లో మొదటి ఎపిసోడ్ లో తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తనకు బావ అయినా నారా చంద్రబాబు నాయుడును బాలకృష్ణ తీసుకొచ్చిన విషయం తెలిసిందే.ఇక రెండవ ఎపిసోడ్ లో యంగ్ హీరో లు విశ్వక్సేన్ మరియు సిద్దు జొన్నలగడ్డ లను తీసుకొచ్చాడు.పెద్దగా ఆ ఎపిసోడ్ అలరించలేదు కానీ… కొత్త హీరోలు.
కుర్ర హీరోలతో బాలకృష్ణ చేసిన సందడి కాస్త పరవాలేదు అనిపించినా తదుపరి ఎపిసోడ్ శర్వానంద్ మరియు అడవి శేషులు హాజరవ్వగా ఆ ఎపిసోడ్ మెప్పించలేక పోయింది.

ఇక బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ ఎపిసోడ్ లు రాకుండా గ్యాప్ ఇస్తూ రావడం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.శర్వానంద్, అడవి శేషు ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యి రెండు వారాలు పూర్తి అయ్యింది.అయినా ఇప్పటి వరకు కొత్త ఎపిసోడ్ రాలేదు.
వచ్చే వారం కొత్త ఎపిసోడ్ రాబోతుందని అధికారికంగా ప్రకటించారు.వచ్చే వారం ఎపిసోడ్ లో బాలకృష్ణ తన మిత్రులను పరిచయం చేయబోతున్నారు.
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి తో పాటు సీనియర్ హీరోయిన్ రాధిక ఈ కార్యక్రమంలో కనిపించబోతున్నారు.పెద్దగా ప్రేక్షకులు ఆ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా లేరు అని తాజాగా ప్రోమో కు వచ్చిన రెస్పాన్స్ ని బట్టి అర్థమవుతుంది.
కనుక ఈ సీజన్ గత సీజన్ మాదిరిగా సక్సెస్ అవ్వలేదు అన్నట్లు ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.







