ఉద్యోగాల నిమిత్తం విద్య వ్యాపారం కోసమో వివిధ దేశాలకు వెళ్ళి స్థిరపడిన భారతీయులు ఆయా దేశాలు అందించే వీసాలను వాటి కాలపరిమితిని బట్టి ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి అలా చేయని పక్షంలో సదరు దేశం విధించే శిక్షలకు,అపరాధ రుసుమును చెల్లించేందుకు సిద్దపడి ఉండాలి.అయితే వీసా రెన్యువల్ చేసుకునే సమయంలో ఏ సంస్థలో పనిచేసినా ఆ సంస్థ నుంచీ నో అబ్జక్షన్ సర్టిఫికేట్ ను తప్పనిసరిగా చూపితేనే రెన్యువల్ చేస్తారు.
లేదంటే రెన్యువల్ చేయకపోగా ఆ దేశాన్ని విడిచి వెళ్ళడంతో పాటు, అక్కడి నిభంధనల ప్రకారం శిక్షార్హులు అవుతారు.అయితే .
ప్రస్తుతం ఈ తరహా సమస్యను ఎదుర్కుంటున్నారు కువైట్ లోని సుమారు 12 వేల మంది భారతీయ ఇంజనీర్లు.ప్రస్తుతం వీరి ఉద్యోగాలు గాల్లో దీపంలా ఉంటాయో, ఊడిపోతాయో తెలియని విధంగా మారిపోయాయి.
అందుకు కారణం వీరందరికీ కువైట్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్ నో అబ్జక్షన్ సర్టిఫికేట్ లు ఇవ్వకపోవడమేనని తెలుస్తోంది.వీరందరూ వీసా రెన్యువల్ కోసం అప్లై చేయాలంటే తప్పనిసరిగా సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్ కువైట్ నుంచీ అనుమతులు ఉండి తీరాల్సిందేనని అంటున్నారు.
అయితే అసలు ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదంటే.

ఈ 12 వేల మంది భారతీయ ఇంజనీర్లు భారత్ లో ఎక్కడైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారో సదరు కళాశాలలు నేషనల్ బోర్డ్ అక్రిడేషన్ లేనివట దాంతో వీరికి నో అబ్జక్షన్ సర్టిఫికేట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్తోంది కువైట్ సొసైటీ ఇంజనీర్స్ ఒక వేళ NOC లేకపోతే రెన్యువల్ కి అవకాశం లేదు రెన్యువల్ జరగక పొతే కువైట్ నిభంధనల ప్రకారం ఉద్యోగాలు పోవడమే కాకుండా దేశం నుంచీ పంపేస్తారు.కాగా వీరిలో అత్యధికులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారే ఉన్నారని తెలుస్తోంది.







