ఈ నెల (మార్చి) 4 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న “కర్మయోగి శ్రీ ధర్మ వ్యాదుడి చరిత్ర “

తల్లిదండ్రుల సేవలోనే దైవత్వం ఉందనే సందేశాన్ని నేటి యువతకు తెలియజేస్తూ నిర్మించిన చిత్రమే “కర్మయోగి శ్రీ ధర్మ వ్యాదుడి చరిత్ర“.భోగి కార్ శ్యామల జమ్ము రాజా సమర్పణలో శ్రీ దుర్గా భవాని క్రియేషన్స్ పతాకంపై ఉల్కందే కార్ మురళీధర్ నిర్మించిన ఈ చిత్రానికి.జి.జే రాజా దర్శకత్వం వహించారు.ఈ “కర్మయోగి శ్రీ ధర్మ వ్యాదుడి చరిత్ర” చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు కీ.శే.యస్.పి.బాలసుబ్రమణ్యం గారు అన్ని పాటలు పాడడం విశేషం.విజయ్ భాస్కర్, అనుషా, అశోక్ కుమార్, ఆనంద్ భారతి, వి.మురళీధర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ నెల 4 విడుదల ఆవుతుంది.ఈ సందర్భంగా చిత్ర  యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయులు సమావేశంలో చిత్ర నిర్మాత ఉల్కందే కార్ మురళీధర్ మాట్లాడుతూ.

 Karmayogi Sri Dharma Vyadu Di Charitra Movie To Be Relese On March 4th , Karm-TeluguStop.com

ఈ చిత్రాన్ని మేము ఎంతో కష్టపడి తీశాము.ప్రస్తుతం లవ్,రొమాన్స్ వంటి కథలు వస్తున్న నేపథ్యంలో నేటి  యువత దైవత్వం సినిమాలు చూడడనికి ఇంట్రెస్ట్ చూపడం లేదు.

ఇలాంటి తరుణంలో  తల్లి తండ్రుల గొప్ప తనాన్ని నేటి యువతకు తెలియజేస్తూ తల్లిదండ్రుల సేవలోనే దైవత్వం ఉందనే సందేశాన్ని ఇస్తూ దారి తప్పే నేటి యువతకు దారి చూపే సినిమా “కర్మయోగి శ్రీ ధర్మ వ్యాదుడి చరిత్ర “.ఈ నెల 4 న వస్తున్న ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.

చిత్ర దర్శకుడు జి.జే రాజా మాట్లాడుతూ.త్రేతాయుగంలో  జనక పురంలోని మిథిలా నగరంలో శ్రీహరి భక్తుడైన “శ్రీ ధర్మ వ్యాధుడు ధర్మములు సూక్ష్మ ధర్మములు ప్రతి ఒక్కరికి తెలియ జేయడమేకాక తన సొంత పిల్లలకు కూడా ధర్మం చెపుతూ వ్యక్తులు ఏ వృత్తి చేసినా తప్పు లేదు కానీ శ్రీమన్నారాయణ యొక్క నామస్మరణాన్ని మాత్రం మరవకూడదు.తల్లిదండ్రులు సేవలోనే శివపార్వతులు దర్శనం ఉందని ప్రజలకు తెలియజేసిన ధర్మవ్యాధుడు వంటి మహానుభావుడు చరిత్రను సినిమాగా తీసే అవకాశం ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు.

ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా చిత్రాన్ని అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్పూర్తిగా కోరుతున్నాను అన్నారు.

సీనియర్ నటులు అశోక్ కుమార్ మాట్లాడుతూ.నా చిన్నతనంలో చదువుకున్న ఈ కథ ను సినిమాగా తీస్తామని నా దగ్గరకు రావడం జరిగింది.ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఈ సినిమా తీయడం ఎంతో కష్టం అన్నాను.

అయితే సమాజినికి మంచి మెసేజ్ ఇవ్వాలనే దృఢ నిక్ష్యయంతో మేము ఉన్నామని దర్శక, నిర్మాతలు ముందుకు వచ్చి ఎంతో తపనతో ఈ సినిమా తీయడం జరిగింది.ఇలాంటి మంచి చిత్రంలో నేను నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.

Telugu Anand Bharathi, Anusha, Ashok Kumar, Raja, Karmayogisri, March, Vijay Bha

చిత్ర హీరో విజయ్ భాస్కర్ మాట్లాడుతూ.కృషారెడ్డి గారి సినిమా జాబిల్లి, 6 టీన్స్, మనసుతో, బతుకమ్మ, మహానగరంలో శివ చందు,నిన్నే కోరుకుంటా వంటి ఎన్నో సినిమాలు చేశాను.అలాగే సపోర్టింగ్ అరిస్టు గా చాలా సక్సెస్ ఫుల్ సినిమాలకు వర్క్ చేశాను.ఎన్నో రకాల పాత్రలు చేసినా ఇలాంటి పాత్ర చెయ్యలేదు.ఇందులో హీరోగా నటిస్తున్నాను.సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే ఇలాంటి  మంచి ఆధ్యాత్మికమైన సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

సంగీత దర్శకుడు లక్ష్మణ్ సాయి మాట్లాడుతూ.నేను ఇప్పటివరకు 23 సినిమాలు చేశాను.

మూడు సీరియల్స్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశాను.వాటికి గాను బెస్ట్ సింగర్ గా,బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా మూడు నంది అవార్డులు కూడా తీసుకున్నాను.

అయితే ఇంతకు ముందు నేను జి.జె రాజాతో “రోజుకో రోజా” కు వర్క్ చేశాను.ఆ తరువాత మేము చేస్తున్న ఈ సినిమా ఎంతో వైవిధ్యమైనది.తల్లిదండ్రులను ప్రేమించాలి అనే కాన్సెప్ట్ ప్రతి ఇంటికి అవసరమే ఈ మెసేజ్ ప్రతి ఇంటికి చేరాలి.

పాటలన్ని కూడా ఎంతో వినసొంపుగా ఉన్నాయి.ఈ నెల 4న వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుతున్నాను అన్నారు.

హీరోయిన్ అనుషా మాట్లాడుతూ.ఇలాంటి మైథలాజికల్ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.నటుడు అనంద్ భారతి మాట్లాడుతూ.ఇందులో నేను మంచి పాత్ర చేశాను.ఇలాంటి మంచి మెసేజ్ ఇచ్చే సినిమా చేయడానికి ముందుకు వచ్చిన దర్శక,నిర్మాత లు ధన్యవాదాలు.ఈ నెల 4 న వస్తున్న ఈ  చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆధరించి ఆశీర్వదించాలని ఆన్నారు.

సినిమాటోగ్రఫర్ పి.దీవరాజ్ మాట్లాడుతూ.దర్శక, నిర్మాత లు పట్టుదలతో ఎంతో కష్టపడి సినిమా తీశారు.ఇందులోని పాటలు చాలా బాగున్నాయి.ఇంత మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.

నటీనటులు

విజయ్ భాస్కర్, అనుషా,అశోక్ కుమార్, ఆనంద్ భారతి, వి.మురళీధర్ ,కావూరి శ్రీనివాసు, ప్రభావతి, అనూష రెడ్డి, రమ్య, లావణ్య, శ్యామ్ సుందర్, సాయి రాజా గోగి కార్, లక్ష్మణ, జయ, మాస్టర్ ఆయుష్ మాన్, మాస్టర్ మణి కిరణ, మాస్టర్ మణి తేజ, బేబీ శ్రీ విద్య తదితరులు

సాంకేతిక నిపుణులు

సమర్పణ : భోగి కార్ శ్యామల జమ్ము రాజా, సౌజన్య రియల్ ఎస్టేట్ యూనిట్, బ్యానర్ : శ్రీ దుర్గాభవాని క్రియేషన్స్, సినిమా : కర్మయోగి శ్రీ ధర్మవ్యాధుడు చరిత్ర, నిర్మాత : ఉల్కందే కార్ మురళీధర్, సహాయ నిర్మాత : గోదా వెంకట కృష్ణారావు కథ రూపకల్పన స్క్రీన్ ప్లే  దర్శకత్వం :  జి జే రాజా, గాయకులు : యస్.పి బాలసుబ్రమణ్యం, లక్ష్మణ సాయి,సుధీర్,లక్మి వినాయక కెమెరా : పి.దీవరాజ్, సంగీతం : లక్ష్మణ సాయి,లక్ష్మీ వినాయక్,సంజీవ్ కుమార్ మోగేటి, పి.ఆర్.ఓ : మూర్తి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube