గమనంలో నాకు నటించే స్కోప్ ఉన్న పాత్ర దక్కింది - ప్రియాంక జవాల్కర్

గమనం సినిమాతో సంజనా రావు దర్శకురాలిగా పరిచయం కాబోతోన్నారు.శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలను పోషించారు.

 Heroine Priyanka Jawalkar About Her Role In Gamanam Movie Details, Heroine Priya-TeluguStop.com

క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.గమనం సినిమాను డిసెంబర్ 10న విడుదల చేయబోతోన్నారు.ఈ సందర్భంగా హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ మీడియాతో ముచ్చటించారు.

ఆ విశేషాలు నిర్మాత జ్ఞానశేఖర్ గారు మొదటగా ఈ సినిమా కోసం నన్ను అడిగారు.ముస్లిం అమ్మాయి పాత్ర కావడంతో బుర్ఖా వేసి లుక్ టెస్ట్ చేశారు.

ఓకే అనుకున్నారు.అలా ఈ గమనం సినిమాలోకి వచ్చాను.

ఇందులో నా పాత్రకు ఎక్కువగా డైలాగ్స్ ఉండవు.కేవలం కళ్లతోనే నటించాల్సి ఉంటుంది.

అదే కొంచెం కష్టంగా అనిపించింది.

నా పాత్ర పేరు ఝారా.

ఆ క్యారెక్టర్ కోసం కొన్ని రిఫరెన్స్‌లు తీసుకున్నాను.నిత్య మీనన్ నటించిన మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాను చూశాను.

కానీ పాత్రను సరిగ్గా అర్థం చేసుకునేందుకు నాలుగు రోజులు పట్టింది.నా చిన్నతనంలో మా చుట్టు పక్కలా ముస్లిం ఫ్యామిలీలు ఉండేవారు.

వారు ఎలా ఉంటారు.ఎలా మాట్లాడతారు అనేవి తెలుసు.

అలా ఈ పాత్రను పోషించడం కాస్త ఈజీగా మారింది.

లేడీ డైరెక్టర్ కావడంతో సుజనా రావు నాకు ఎక్కువగా కనెక్ట్ అయ్యారు.

షూటింగ్ అయిపోయాక మరింత క్లోజ్ అయ్యాం.లేడీ డైరెక్టర్ అవడంతో నాకు ఏమైనా సమస్యలున్నా కూడా షేర్ చేసుకునేదాన్ని.

Telugu Chaaru Hasan, Sandhya Rao, Gamanam, Nithra Menon, Gnanasekhar, Role, Shiv

గమనంలో నాకు నటించే స్కోప్ ఉన్న పాత్ర దక్కింది.మామూలుగా నన్ను చూస్తే అందరూ కూడా కమర్షియల్ సినిమాలకు పనికొస్తానని, తెల్లగా ఉన్నావ్ విలేజ్ అమ్మాయి పాత్రలు వద్దని అంటారు.ఇలాంటి పాత్రలు చేస్తే నటనకు ప్రాధాన్యమున్న పాత్రలకు కూడా సూట్ అవుతుందని అందరికీ తెలుస్తుంది.

ఈ కథ కంటే ముందే చాలా కమర్షియల్ కథలు విన్నాను.కానీ అంతగా నచ్చలేదు.గమనం కథ వినగానే నచ్చింది.

వేదం సినిమా టైపులో ఉంటుంది.ఇక ఇళయరాజా గారు సంగీతమందిస్తున్నారని తెలియడంతో మళ్లీ ఇలాంటి అవకాశం రాదని వెంటనే ఓకే చెప్పాను.

శివ కందుకూరితో ఇది వరకే చూసీ చూడంగానే సినిమాను చేయాల్సింది.కానీ మిస్ అయింది.

మళ్లీ మధ్యలో ఓ సినిమా కూడా మిస్ అయింది.మొత్తానికి గమనం సినిమాతో కుదిరింది.

మేం ఇద్దరం ఫ్రెండ్స్.ఆయన్ను చూసి సిగ్గుపడాలని డైరెక్టర్ చెప్పేవారు.

కానీ ఫ్రెండ్స్‌తో అలా ఎలా చేయగలం.

Telugu Chaaru Hasan, Sandhya Rao, Gamanam, Nithra Menon, Gnanasekhar, Role, Shiv

చారు హాసన్ గారి నటన గురించి చెప్పడానికి నేను ఎవరిని.ఆయనతో వర్షంలో ఓ సీన్ ఉంటుంది.నేను జాగ్రత్తగా చేయాలని అనుకున్నాను.

ఎందుకంటే రెండో టేక్ తీసుకుంటే ఆయనకు ఇబ్బంది కలుగుతుంది అనుకున్నాను.ఆయన చాలా మంచివారు.

సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తూ ఉంటే కెరీర్ స్లో అవుతుందనే భయం ఉంటుంది.అలా అని వచ్చిన సినిమాలన్నీ ఫటా ఫట్ చేస్తే ఫ్లాపులు వస్తే పరిస్థితి ఏంటనే భయం కూడా ఉంటుంది.

అందుకే నాకు కథ నచ్చితేనే ఒప్పుకుంటాను.నాకు అందరు హీరోలతో పని చేయాలని ఉంది.

ఓ లవ్ స్టోరీ సినిమా చేయాలని ఉంది.అందులో అయితే హీరోతో సమానంగా క్యారెక్టర్ ఉంటుంది.

వర్షం పడితే రోడ్డు మీద పరిగెత్తిస్తారని.వర్షం పడొద్దని దేవుడిని ప్రార్థించేదాన్ని.

ఒక్కోసారి నేను నా ఫ్రెండ్స్‌తో మాట్లాడుతుంటే.ఝారాల మాట్లాడుతున్నావేంటని అన్నారు.

అంతలా క్యారెక్టర్‌కు కనెక్ట్ అయ్యాను.

నిర్మాత, కెమెరామెన్ జ్ఞానశేఖర్ గారు ఆర్టిస్ట్‌కు ఎంతో కంఫర్ట్ ఇస్తారు.

ఒకసారి స్కిన్ బాగా లేకపోతే మేకప్ వేశారని అందరి మీద అరిచేశారు.బాగా లేనప్పుడు ఎందుకలా చేశారని అన్నారు.

ఆర్టిస్ట్‌లను అంత బాగా చూసుకుంటారు.

కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రనైనా చేస్తాను.

బోల్డ్ కారెక్టర్ కూడా చేస్తాను.అర్జున్ రెడ్డి సినిమాను అందరూ బోల్డ్ అన్నారు.

కానీ నాకు చాలా నచ్చింది.

టాక్సీవాలా సినిమా సక్సెస్‌ను వాడుకోలేకపోయాను అని కొంత మంది అంటారు.

నాక్కూడా ఒక్కోసారి అనిపిస్తుంది.కానీ విధిని మనం మార్చలేం.

కొన్ని సినిమాలు మనకు వద్దనుకున్నా వస్తాయి.ఎస్ఆర్ కళ్యాణమండపం, తిమ్మరుసు ఇంత హిట్ అవుతాయని నేను కూడా అనుకోలేదు.

గమనం సినిమా కూడా హిట్ అవుతుందని అనుకుంటున్నాను.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube