విజయవాడ: సిపిఐ రామకృష్ణ కామెంట్స్.ఈసారి జరిగిన అసెంబ్లీ సమావేశాలు సభ హుందాను దిగజార్చారు.1953-2022 వరకు జరిగిన సమావేశాలలో ఎప్పుడూ ఇంత ఘోరంగా జరగలేదు.ప్రజల సమస్యలు, పరిష్కారం పై చర్చే లేదు.
ఏక పక్షంగా నిర్ణయాలు ఆమోదించు కోవడం, ప్రతిపక్ష సభ్యులను తిట్టడానికే అసెంబ్లీ సమావేశాలా.పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరితే అరెస్టులు చేస్తారా.
ప్రభుత్వ వైఫల్యాలను అడిగే స్వేచ్చ కూడా లేదా.అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులను సస్పెన్షన్ చేసి… మీరు భజన చేయించు కుంటారా.
మీకు భజన చేయడానికి అసెంబ్లీ సమావేశాలు దుర్వినియోగం చేస్తారా.కోర్టులను కూడా తప్పు బట్టి నోటికి వచ్చినట్లు మాట్లాడతారా.
కోర్టు తీర్పు మీకు అనుకూలంగా రాకపోతే విమర్శలు చేస్తారా.
మీరు రాజ్యాంగ బద్దంగా నిర్ణయాలు చేస్తే కోర్టుల జోక్యం అవసరం ఉండదు కదా.చట్టాలు చఢయాల్సిన సభలలను భజన సభలుగా ఎలా మారుస్తారు.జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా ఘటనపై సాక్షాత్తు సిఎం అసెంబ్లీలో అసత్యాలు చెప్పారు.
ఏమీ జరగక పోతే ఎక్సైజ్ అధికారులు ఎలా చర్యలు తీసుకున్నారు.మరీ ఇంత పచ్చిగా అబద్దాలు ఆడటమేనా జగన్.
నీ విశ్వసనీయత.సిఎం అబద్దాలు చెబుతుంటే… ఆపార్టీ ఎమ్మెల్యే లు భజన చేస్తున్నారు.
మన స్పీకర్ తమ్మినేని సీతారాం ఆ కుర్చీకి ఉన్న పరువు తీస్తున్నారు.మంత్రి పదవి కోసం తమ్మినేని స్పీకర్ పదవిని దిగ జార్చారు.
ఆయన్ను తప్పించి… పద్దతిగా నడుచుకునే వారికి స్పీకర్ బాధ్యత అప్పగించాలి.ఈనెల 28, 29తేదీలలో చేపట్టిన సమ్మెకు అందరూ మద్దతు ఇవ్వాలి.
కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకునే నిర్ణయాలను ఉపసంహరించు కోవాలి.







