రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2023 సంవత్సరం లో పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామంకు చెందిన రమేష్ చారి మీద 11 కేసులలో,2018 సంవత్సరం లో జగిత్యాల, కరీంనగర్, సిద్ధిపేట్ జిల్లాలో 8 కేసులలో ఆన్లైన్ ఫ్లాట్ ఫారంగా చేసుకొని తక్కువ ధరలకు ఎలక్ట్రానిక్ వస్తువులు,గోల్డ్ ఇప్పిస్తా అని చేసిన మోసాలలో నిందుతుడుగా ఉన్నాడు.గతంలో జాబ్ ఫ్రాడ్ కేసులో రమేష్ చారి మీద పిడి యాక్ట్ నమోదు చేయడం జరిగింది.
మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ రమేష్ చారి అనే వ్యక్తి ప్రైవేటు టీచర్ గా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామంలో పని చేసేవాడని, ప్రస్తుతం ఫుడ్ ప్రాసెసింగ్ వర్క్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడని, దీని ద్వారా వచ్చే డబ్బులు సరిపోక, ఎలాగైనా సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో, ఆన్లైన్ లో వివిధ వస్తువులు ఆఫర్ లో పెట్టినప్పుడు తక్కువ ధరకు కొనుగోలు చేసి తన ఫేస్ బుక్, వివిధ సోషల్ మీడియా వేదికల్లో అతి తక్కువ ధరకు పోస్ట్ పెట్టేవాడని, అవి చూసి చాలా మంది ఫోన్ లు చేసేవారని, వారికి వస్తువులు డెలివరీ చేసి వారి వద్ద నుండి డెలివరీ ఖర్చుల డబ్బులు మాత్రమే తీసుకునేవాడని తెలిపారు.
ఇలా అధిక మొత్తంలో డబ్బులు రావడం చూసి ఎలాగైనా తనే ఒక మార్కెటింగ్ వెబ్ సైట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుని, మోసాలకు పాల్పడ్డాడని వివరించారు.
నేరం చేయడానికి సులువైన పద్ధతులు ఎంచుకున్నాడు.రమేష్ చారి ఒక వెబ్ సైట్ ఓపెన్ చేసి ఇంకా అధిక మొత్తంలో డబ్బులు సపాదించాలనే ఉద్దేశ్యంతో ఫేస్ బుక్ లో “రమేష్ చారీ ” అనే ఐడి ఏర్పాటు చేసుకున్నాడని, వీటికి 8332924133, 8790097813 ఫోన్ నంబర్స్ లింక్ చేసి తను ఫ్లిప్ కార్ట్,అమెజాన్ లలో ఆఫర్ లో వచ్చే వస్తువులు కొనుగోలు చేసి, వాటిని తక్కువ ధరకు తన ఫేస్ బుక్ లో మార్కెటింగ్ ఆడ్ ఇస్తూ చాలా మందిని నమ్మించి అధిక మొత్తం లో డబ్బులు వసూలు చేశాడని తెలిపారు.
తన ఫేస్ బుక్ ఐడీ ని చూసి చాలా మంది తనకు ఫోన్లు చేసి, వారికి పూర్తి వివరాలు చెప్పడంతో కొద్ది సమయం తీసుకొని అతనికి ఉన్న బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేసి ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసేవారని వివరించారు.
ఇట్టి వ్యాపారం దాదాపుగా గత 14 నెలలుగా చేస్తూ చాలా మంది నుండి పెద్ద మొత్తంలో డబ్బులను వసూలు చేస్తూ అందులో కొద్ది మందికి మాత్రమే వస్తువులు డెలివరీ చేసేవాడని, మీకు తెలిసిన వారికి కూడా చెప్పండి అంటూ బుట్టలో పడ్డ వారందరిలో కొద్దిమందికి వస్తువులు ఇస్తూ, మిగతా వారికి వస్తువులు ఇవ్వకుండా డెలివరీ చేయడానికి కొంచెం సమయం పడుతుంది, నన్ను నమ్మి ఉండండి అని వారిని నమ్మిస్తూ కాలం గడిపేవాడని పేర్కొన్నారు.
వీటితో పాటుగా తాను గోల్డ్ స్మిత్ సామాజిక వర్గానికి చెందిన వాడినని, తన వద్ద గోల్డ్ స్మిత్ కార్డ్ ఉందని, దాని ద్వారా తక్కువ ధరకు బంగారం కొనిస్తాను అని ప్రజలను నమ్మించి, చాలా మంది వద్ద అధిక మొత్తంలో డబ్బులు తీసుకుని కొందరికి సగం డబ్బుల వరకు బంగారం కొని ఇచ్చి, మిగతా డబ్బులతో ఎంజాయ్ చేసేవాడని, అలా వసూలు చేసిన డబ్బులు తన పేరు మీద ఉన్న నాలుగు బ్యాంక్ అకౌంట్లు ఎస్బిఐ ధర్మారం లో ఒక సేవింగ్స్ అకౌంట్,తెలంగాణా గ్రామీణ బ్యాంకు, ధర్మారం బ్రాంచ్ లో ఒక సేవింగ్స్ అకౌంట్, 3.ఆక్సిస్ బ్యాంకు కరీంనగర్ బ్రాంచ్ లో ఒక కరెంట్ అకౌంట్, 4.యూనియన్ బ్యాంకు ధర్మారం బ్రాంచ్ లో ఒక సేవింగ్స్ అకౌంట్ లో డిపాజిట్ చేసి, వాటిని తన వ్యాపార అవసరాలకు ఉపయోగించుకునేవాడని అన్నారు.
ఇట్టి మోసాల కోసం హైదరాబాద్ ప్రగతినగర్ లో మన తెలంగాణ ఫుడ్స్ & ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్ అని ఆఫీస్ పెట్టుకొని రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాడని, ముస్తాబాద్ మండలానికి చెందిన ఆదర్శ్ గౌడ్ ఫిర్యాదు మేరకు ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
విచారణలో భాగంగా సి.ఐ సాధన్ కుమార్,సైబర్ క్రైమ్ ఆర్.ఎస్.ఐ జునైద్ లతో స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా సమయానికి వస్తువులు ఇవ్వలేకపోవడంతో తనను కొంతమంది డబ్బులు ఇచ్చినవారు ఇబ్బంది పెట్టడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తప్పించుకు తిరుగుతున్నడు అని,హైదరాబాద్ లో ఉన్న ఏమశెట్టి శ్రీకాంత్ దగ్గరకు వెళ్లి తాను చేసిన మోసం గురించి వివరించి, శ్రీకాంత్ కు డబ్బులు ఇస్తా అని ఆశచూపి, తనకు నివాసం కల్పించాల్సిందిగా కోరాడని, శ్రీకాంత్ తనకు నివాసం ఇవ్వడంతో పాటు, తన పేరు మీద రమేష్ చారికి సిమ్ కార్డ్ కొనివ్వడం జరిగిందని తెలిపారు.
కొద్ది రోజులకు తన దగ్గర ఉన్న డబ్బులు అన్ని అయిపోగా, మళ్లీ ఎవరినైనా మోసం చేయాలనే ఉద్దేశ్యంతో సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామానికి చెందిన ఆదర్శ్ గౌడ్ వద్దకు రాగా ఆధునిక సాంకేతికత ఆధారంగా అవునూరు గ్రామానికి వస్తున్నాడు అని తెలిసి శనివారం అందజ సాయంత్రం ఆరు గంటల ప్రాంతలో రమేష్ చారిని అరెస్ట్ చేసి దర్యాప్తు లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా సుమారు తొమ్మిది కోట్ల మేర లావాదేవీలు జరిగినట్టు తేలింది.రమేష్ చారి కి సంబంధించిన నాలుగు బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేయడం జరిగింది అని తెలిపారు.
ఈ సందర్బంగా ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి చేశారు.ప్రజలు సైబర్ మోసాల పట్ల,మల్టీ లెవల్ బిజెన్స్ చేసే వారికి దూరంగా ఉండాలని,సోషల్ మీడియాలో వచ్చే ఉద్యోగ ప్రకటనలు చూసి మోసపోవద్దు అని ఈ సందర్భంగా కోరారు.
రమేష్ చారిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన సైబర్ క్రైమ్ ఎస్.ఎస్.ఐ జునైద్, సిబ్బంది ని ప్రత్యేకంగా అభినందించారు.రమేష్ చారి ఆన్లైన్ ఫ్లాట్ ఫారంగా చేసుకొని తక్కువ ధరలకు ఎలక్ట్రానిక్ వస్తువులు,గోల్డ్ ఇస్తా అని అమాయక ప్రజల వద్ద నుండి మోసం చేసి డబ్బులు తీసుకున్న వారి వివరాలు తెలిపారు.
వేములవాడ గ్రామానికి చెందిన బైరి అనిల్ ద్వారా కరోన సమయంలో నా వద్ద మాస్క్ లు కొనుగోలు చేస్తూ పరిచయమై, కొద్ది రోజులకు అతని దగ్గర ఎలక్ట్రానిక్ వస్తువులకు ఆర్డర్ ఇచ్చాడు.
వస్తువులు ఇస్తానని నమ్మించి అతడి వద్ద నుండి 1,20,00,000/-రూపాయలను విడతల వారిగా వసూలు చేశాడు.
కనపర్తి హరీష్ ద్వారా వేములవాడకు చెందిన మరికొంత మంది వ్యక్తులు పరిచయం అయి కొన్ని ఆర్డర్స్ పెట్టగా, హరీష్ కు వస్తువులు డెలివరీ చేసిన ఫోటోలు వారికి చూపించి వారి వద్ద నుండి సుమారు 30,00,000/- రూపాయలు తీసుకున్నాడు.వేములవాడకు చెందిన కనపర్తి హరీష్ ద్వారా చందుర్తి గ్రామానికి చెందిన దిలీప్ @ చింటు పరిచయం కాగా, అతడి వద్ద నుండి వస్తువుల కోసం 5,00,000/- రూపాయల వసూలు చేశాడు.
వీర్నపల్లి మండలం అడవిపదిర గ్రామానికి చెందిన పూర్ణచంద్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి దర్శనం కోసం రాగా, రమేష్ చారిని చూసి మీరు తక్కువ ధరకే ఎలక్ట్రానిక్ వస్తువులు ఇస్తారు కదా అని పరిచయం చేసుకున్నాడు.తనకు యాపిల్ 13 ప్రో మొబైల్ కావాలని, ఎంతకు వస్తుంది అని అడుగగా ఒక లక్ష రూపాయల ఇరవై వేల రూపాయల విలువగల మొబైల్ ఒక లక్ష రూపాయలకు వస్తుందని చెప్పి పూర్ణచంద్ ను నమ్మించాడు.
వారు ఇంటికి తీసుకొని వెళ్ళి ఒక లక్ష రూపాయల నగదు రమేష్ చారికి ఇచ్చారు.
అతడిని, అతడికి తెల్సిన వ్యక్తులను నమ్మించడానికి పూర్ణచంద్ కు మొబైల్ ఇచ్చి, తనకు తెలిసిన వారందరికీ చెప్పాలని నమ్మించాడు.
దీంతో పూర్ణ చంద్ వారి గ్రామంలోని కొమ్ము అంజలి, మడుపు తిరుపతి రెడ్డి, కమ్మరి ఆంజనేయులు, ప్రశాంత్, మహిపాల్ రెడ్డి, పూర్ణచంద్ బంధువులు కొంతమందికి కలిసి 1 కోటి 20 లక్షలు రమేష్ చారీకి అప్పగించారు.కానీ వారికి వస్తువులు ఇస్తా అంటూ నమ్మించి మాట దాటవేస్తూ వాయిదాలు వేస్తూ వచ్చాడు.
బైరి అనిల్ ద్వారా పరిచయమైన అంబగోని రాజేశం దగ్గర పది లక్షల రూపాయలు తీసుకున్నాడు.మహిపాల్ రెడ్డి దగ్గర కొన్ని వస్తువులు కొంత బంగారం ఇస్తా అని 60 లక్షలు రూపాయలు విడతల వారీగా వసూలు చేశాడు.
తనకు గతంలో పరిచయమైన పాలకుర్తి సాగర్ గౌడ్ ను కలిసి యోగక్షేమాలు అడిగి నా మిత్రులు కూడా మీ దగ్గర అతి తక్కువ ధరకు వస్తువులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలుపగా, వారి ఇంటికి వెళ్లి వారి మిత్రులు రవిరాజ్, రమేశ్ ,సాగర్ బంధువులు లక్ష్మణ్, నరేశ్ ల నుండి ఒక్కొక్కరి దగ్గర 1,10,000/- రూపాయల చొప్పున 4,40,000/- రూపాయలు తీసుకున్నాడు.
ఎల్ఎండి తిమ్మాపూర్ గ్రామానికి చెందిన అనిల్ దగ్గర 5,70,000/- రూపాయలు వసూలు చేశాడు.
గతంలో పరిచయమైన ఎమిశెట్టి శ్రీకాంత్ హైదరాబాద్ కు చెందిన వ్యక్తి తనకు ఫోన్ చేసి నేను కూడా ఆర్డర్ పెడతా అని చెప్పగా, తన ద్వారా 25 లక్షల రూపాయలు తీసుకుని తనకు ఒక బైక్, ఒక ఏసి, ఒక వాషింగ్ మిషన్ డెలివరీ ఇచ్చాడు.విజయవాడకు చెందిన సాదినేని రాజేశ్వరి పరిచయమై తను కూడా ఆర్డర్ పెడతాను అని చెప్పగా తన తండ్రి ద్వారా ముందుగా 5,00,000/-రూపాయలు ఆర్డర్ తీసుకొని నమ్మకం కలిగించేందుకు వారికి వస్తువులు డెలివరీ చేశాడు.
తర్వాత రాజేశ్వరి విజయవాడలోని వారి ఇంటికి పిలిచి విడతల వారీగా జగదీష్, వారి మిత్రులు ద్వారా సేకరించిన 90,00,000/- రూపాయలు తీసుకున్నాడు.తర్వాత సాదినేని రాజేశ్వరి గారి తల్లిదండ్రుల నుండి 50,00,000/- రూపాయలు వసూలు చేశాడు.అనంతపూర్ జిల్లాకు చెందిన విజయ్ ఫోన్ చేసి తన మిత్రుల ద్వారా మీ గురించి తెలుసుకున్నానని, రమేష్ చారీని తమ గ్రామానికి రమ్మని కోరాడు.14 నెలలుగా విడతల వారీగా 1,50,00,000/- రూపాయల విలువ చేసే వస్తువులను ఆర్డర్ పెట్టగా తనకి నమ్మకం కలిగించుటకు ముందు కొన్ని వస్తువులు ఇచ్చాడు.
హైదరాబాద్ కు చెందిన ప్రశాంత్, మురళి పరిచయం కాగా వారికి బంగారం, వస్తువులు ఇస్తా అని చెప్పి, వారి వద్ద నుండి 5,00,000/- రూపాయలు వసూలు చేశాడు.వీరికి కొన్ని వస్తువులు డెలివరీ చేసిన ఫేక్ ఫొటోస్ చూపెట్టి హైదరాబాద్ కు చెందిన కోటేష్ ను నమ్మించి అతడి వద్ద నుండి 25 లక్షల రూపాయలు తీసుకున్నాడు.
సిద్దిపేట కి చెందిన ఎస్ఎస్ చానల్ నరేష్ 18,00,000/- రూపాయల విలువ చేసే వస్తువులు దఫాలవారీగా డెలివరీ పెడతానని తెలుపగా సరే అని చెప్పి అతడిని నమ్మించుటకు మిగతా వాళ్ళకు ఇచ్చిన ఫేక్ ఫొటోస్ చూపెట్టి అతడి వద్ద నుండి 18,00,000/- రూపాయల ఆర్డర్ దఫాలవారీగా తీసుకున్నాడు.వీర్నపల్లి మండలం అడవిపదిర గ్రామానికి చెందిన మహిపాల్ రెడ్డి ద్వారా పరిచయమైన కరీంనగర్ కు చెందిన అనిల్ కు 70,000/- రూపాయల విలువ చేసే వన్ ప్లస్ 10 ప్రో మొబైల్ ఆర్డర్ చేయగా వారికి సమయానికి ఇవ్వలేదు.
ముస్తాబాద్ కు చెందిన ఆదర్శ్ గౌడ్ ఫోన్ చేసి ఒక ఏసీ కావాలని చెప్పగా, తనకు ఆఫర్ చెప్పి అతడిని నమ్మించుటకు తన దగ్గర 35,000/- తీసుకొని తనకి ఏసి ఇచ్చాడు.
తరువాత ఆదర్శ్ ఆపిల్ ఫోన్ కావాలని అడగగా అతడి వద్ద నుండి 1,00,000/- తీసుకున్నాడు.
రమేష్ చారి మాటలు నమ్మి, ఆదర్శ్ గౌడ్ తన మిత్రులు బద్దెపురి మేరీష్, శివ్వని బాలలింగం ల వద్దకు చెప్పగా, మొబైల్ ఇస్తానని మేరీష్ దగ్గర 60,000/- బాలలింగం వద్ద నుండి 30,000/- రూపాయలు తీసుకుని ఆదర్శ్ గౌడ్ రమేష్ చారికి ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించాడు.వారు మొబైల్స్ కోసం పదే పదే తనకు ఫోన్ చేయగా వారికి నమ్మించడానికి 50,000/- రూపాయలు మొబైల్ స్టాక్ లేదని తిరిగి ఇచ్చాడు.
జగిత్యాల జిల్లా ధర్మపురి గ్రామానికి చెందిన కార్తీక్ తనకు ఫోన్ చేసి కొత్త ఫోన్ కావాలని చెప్పి 1,20,000/- రూపాయలు ఫోన్ పే చేశాడు.ఆ తర్వాత జగిత్యాల జిల్లాకు చెందిన రాజేష్ నాకు రెండు ఐఫోన్లు 14 ప్రొ మ్యాక్స్ కావాలని 3,00,000/- రూపాయలు ఫోన్ పే చేశాడు.
వారి వద్ద డబ్బులు తీసుకొని జల్సాలు చేస్తూ డబ్బులు మొత్తం ఖర్చు చేశాడు.ఈ మీడియా సమావేశంలో డీఎస్పీ ఉదయ్ రెడ్డి, సి.ఐ సాధన్ కుమార్, ఎస్.ఐ శేఖర్ సిబ్బంది పాల్గొన్నారు.