Ratha Saptami : రథసప్తమి రోజు జిల్లేడు ఆకులతో స్నానం ఎందుకు చేయాలో తెలుసా..?

రథసప్తమి రోజున జిల్లేడు ఆకులను( Jilledu Leaves ) తలపై పెట్టుకుని ఎందుకు స్నానం చేయాలి? జిల్లేడు ఆకులను రథసప్తమికి( Ratha Saptami ) సంబంధం ఏంటి? దీని వెనక ఆధ్యాత్మిక మైన సైంటిఫిక్ రీసన్ ఏమైనా ఉందా? అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు.అయితే రథసప్తమి రోజు జిల్లేడు ఆకులు శరీరం పైన ధరించి తలస్నానం చేసి, సూర్యరాధన చేస్తారు.

 Why Should We Take Bath With Jilledu Plant Leaves On Ratha Saptami-TeluguStop.com

ఎందుకంటే జిల్లేడు చెట్టు సూర్యశక్తిని అది అత్యధికంగా గ్రహిస్తుంది.ఇక ఈ చెట్టు ఆకులను అర్క పత్రాలు అని కూడా అంటారు.

ఈ అర్క పత్రాలను గణపతి పూజలో విశేషంగా ఉపయోగిస్తారు.ఇక మన పూర్వీకులు కూడా మనకు అనేక ఆరోగ్య రహస్యాలను మన ఆచారులతో కలగలిపి వీటిని అందించారు.

Telugu Arka Tree, Bath, Toxins, Dharmaraju, Jilledu, Ratha Saptami, Rathasaptami

ఈ ఆకులను తలపై, శరీరంపై ధరించి స్నానం చేయడం వలన శరీరంలోని వేడి తగ్గిపోతుంది.అంతేకాకుండా శరీరంలోని టాక్సిన్స్ ను( Toxins ) కూడా లాగేసుకుంటాయి.దీనిని ఆంగ్లంలో బెలడోరా అని అంటారు.అయితే పుండ్లు, గాయాలు నయం చేయడానికి అర్కచెట్టు నుంచి వచ్చే పాలతో నల్లటి జిగురు పదార్థాన్ని తయారుచేసి, ఒక గుడ్డు మీద పోసి పుండ్లు, గాయాలకు అంటించేవారు.

ఈ ప్రక్రియలను చిల్లుల పలాస్త్రి అని కూడా అంటారు.ఆ ఆకులను కాస్త వేడి చేసి గాయాలపై( Injuries ) అంటిస్తే నొప్పి, వాపు తగ్గించడంతో పాటు దాంట్లో ఉన్న బ్యాక్టీరియా కూడా తొలగిపోతుంది.

Telugu Arka Tree, Bath, Toxins, Dharmaraju, Jilledu, Ratha Saptami, Rathasaptami

మన వేదాల్లో పురాణాలు, ఇతిహాసాలలో సూర్యునికి( Sun ) సంబంధించిన ఎన్నో విషయాలు చెప్పారు.ధర్మరాజు వేటాడడానికి వచ్చిన అనేకమంది పౌరులకు ఆహారాన్ని సమర్పించడానికి కూడా ధర్మరాజు సూర్యోపాసన చేసి అక్షయపాత్రను( Akshayapatra ) పొందినట్లు కూడా మహాభారతం చెబుతోంది.భూమిపై జీవరాశుల మనుగడకు సూర్యుడే కారణం.ఈ కారణంగానే భానుడిని కనిపించే దేవుడు అని అంటారు.అందుకే సూర్యోదనకు ఎంతో విశిష్టత ఉంది.అందుకే రథసప్తమి రోజు జిల్లేడు ఆకులతో స్నానం చేయాలని చెబుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube