ప్రొ.అలేఖ్య పుంజుల, చైర్పర్సన్ తెలంగాణ సంగీతా నాటక ఆకాడమీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహించు “జయ జయహే ప్రజా పాలన” సాంస్కృతిక కార్యక్రమాలు.సిరిసిల్ల పట్టణం కొత్త బస్టాండ్ సమీపంలోనీ డా.సి నారాయణ రెడ్డి కళాక్షేత్రం లో సా.6.00 గంటలకు నిర్వహణ ప్రజలు , యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో డిసెంబర్ 4న ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా ప్రొఫెసర్ అలేఖ్య పుంజుల, చైర్పర్సన్ తెలంగాణ సంగీతా నాటక ఆకాడమీ హైదరాబాద్ వారి ఆధ్వర్యం లో నిర్వహించు “జయ జయహే ప్రజా పాలన” సాంస్కృతిక కార్యక్రమాలు.నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని, ఇందులో భాగంగా డిసెంబర్ 4న ప్రొఫెసర్ అలేఖ్య పుంజుల, చైర్పర్సన్ తెలంగాణ సంగీతా నాటక ఆకాడమీ హైదరాబాద్ వారి కళా బృందం సారథ్యంలో సిరిసిల్ల ప్రాంతానికి విచ్చేసి వివిధ కళా రూపాలలో ప్రభుత్వ కార్యక్రమాలు, గత సంవత్సర కాలంలో సాధించిన విజయాలను తెలుపుతూ కళా ప్రదర్శనలు చేయడం జరుగుతుందని అన్నారు.
సిరిసిల్ల పట్టణం కొత్త బస్టాండ్ సమీపంలోనీ డా.సి నారాయణ రెడ్డి కళాక్షేత్రం లో డిసెంబర్ 4 న సా.6.00 గంటలకు ప్రజా పాలన విజయోత్సవాల కార్యక్రమం నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు హాజరవుతారని, యువతీ యువకులు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఈ ప్రకటనలో పేర్కొన్నారు
.