ప్రజల, ప్రభుత్వ సహకారంతోనే గ్రామ అభివృద్ధి చేసిన సర్పంచ్ చల్ల నారాయణ..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అనంతారం గ్రామాన్ని ప్రజల, ప్రభుత్వ సహకారతోనే అన్ని విధాల అభివృద్ధి చేశానని గ్రామ సర్పంచ్ చల్ల నారాయణ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో తను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల వివరాలు వెల్లడించారు.

 Sarpanch Challa Narayana Developed The Village With The Cooperation Of The Peopl-TeluguStop.com

గ్రామంలో పలు వీధులలో సిసి రోడ్ల నిర్మాణం, కాపు సంఘము ప్రహరీ గోడ నిర్మాణం రజక సంఘ ప్రహరీ గోడ నిర్మాణం మహిళా సంఘ భవన నిర్మాణము పూర్తి చేయడం జరిగిందని,అదే విధంగా వడ్డెర సంఘ భవన నిర్మాణము హైమాస్ లైట్లు ఏర్పాటు డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని,గ్రామంలో కొత్తగా పైప్ లైన్ వేసి తాగునీటి సమస్యను పరిష్కరించినట్టు పేర్కొంటూ గ్రామపంచాయతీకి ట్రాక్టర్ కొనుగోలు చేయడం జరిగిందని,అనంతారం ఆమ్లెట్ గ్రామమైన రెడ్డి వాడలో సీసీ రోడ్ల నిర్మాణం చేశామని అంతేకాకుండా రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటి ట్రీగార్డ్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Telugu Anantaram, Cc Road, Challa Yana, Developed, Illanthakunta, Sarpanchchalla

అదే విధంగా ప్రతి ఇంటికి ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు 30 రోజుల గ్రామ ప్రణాళికను నాలుగుసార్లు విజయవంతంగా పూర్తి చేసినట్టు అభివృద్ధి ర్యాంకు మెరుగుపరుచుకున్నట్టు, గ్రామంలో యాదవ సంఘం భవనమునకు రేకుల షెడ్డు వేయడం జరిగిందని రెండు బోర్లు వేయించడం జరిగిందని స్మశాన వాటిక నిర్మాణము పూర్తి చేయడం జరిగిందని, గ్రామంలో కంపోస్టు షెడ్డు నిర్మాణము పకృతి వన నిర్మాణము, సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం జరిగిందని,ముదిరాజు సంఘ ప్రహరీ గోడ నిర్మాణము గ్రామ సంత ఏర్పాటు బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణము పూర్తి చేయుట జిమ్ పరికరాలు ఏర్పాటు చేయడం జరిగిందని,అదేవిధంగా పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు ఇటీవలనే గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా జరుపుకున్నట్టు పేర్కొన్నారు.

అంతేకాకుండా గ్రామంలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కూడా పూర్తి చేసినట్టు పేర్కొన్నారు అదేవిధంగా డాల్ బంగ్లా చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రం చేయించినట్టు, గ్రామంలో క్రీడా ప్రాంగణము ఏర్పాటు చేయడం జరిగిందని మహిళా బిల్డింగ్ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం జరిగిందని,గ్రామంలో అనేకమందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించడం జరిగిందని పేర్కొన్నారు అదేవిధంగా గ్రామ పాఠశాలలో అదనపు తరగతి గదులు బాత్రూమ్స్ కట్టించడం జరిగిందని తెలిపారు.ఈ విధంగా గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసినట్టు సర్పంచ్ పేర్కొంటూ ఈ అభివృద్ధిలో ప్రజల ప్రభుత్వ సహకారం ఉందని,ఎల్లప్పుడూ తాను ప్రజలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube