ఏపీలోని వైసీపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే వైసీపీ అధిష్టానం నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జ్ లను నియమించడంతో పాటు కొందరు నేతలకు నియోజకవర్గాన్ని మార్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే నియోజకవర్గ మార్పుపై మంత్రి మేరుగ నాగార్జున స్పందించారు.నియోజకవర్గ మార్పుపై ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు.
ప్రస్తుతం సంతనూతలపాడు నియోజకవర్గానికి ఇంఛార్జ్ గా ఉన్నానన్న ఆయన సీఎం జగన్ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు.అలాగే పార్టీలోని ఎమ్మెల్యేలకు అసంతృప్తి లేదని స్పష్టం చేశారు.