రాజన్న సిరిసిల్ల జిల్లా: ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువుతో పాటుగా, ఉన్నత లక్ష్యాలను చేరేలా మార్గనిర్దేశం చేయాలని జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ & మార్గదర్శకత్వం పై జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమాన్ని వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించారు.
రెండు రోజుల శిక్షణలో భాగంగా మొదటి రోజు ఆయన హాజరై మాట్లాడుతూ విద్యార్థులు చదువు సక్రమంగా కొనసాగించడంలో ఏర్పడుతున్న అవరోధాలను అధిగమించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన సూచించారు.
పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
వారి భవిష్యత్తుకు అనుగుణంగా వివిధ కోర్సుల పై దిశా నిర్దేశం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష క్వాలిటీ కోఆర్డినేటర్ శైలజ, మండల విద్యాధికారి బన్నాజీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజారత్నం, ఆర్ పి లు, జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాల నుండి ఒక ఉపాధ్యాయులు, సీఆర్పీలు పాల్గొన్నారు.