మానసిక ఉల్లాసానికి,దేహదారుడ్యానికి క్రీడలు దోహదం

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సీఎం కప్ పోటీల ప్రారంభోత్సవాల్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా 2కె రన్ నిర్వహించిన జిల్లా కలెక్టర్రాజన్న సిరిసిల్ల జిల్లా :క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహదారుడ్యానికి దోహద పడతాయని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు.ప్రజా పాలన ఏడాది అయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు.

 Sports Contribute To Mental Happiness And Physical Well-being , Sports Contribut-TeluguStop.com

ఇందులో భాగంగా మొదటి రోజు సీఎం కప్ పోటీల సందర్బంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం 2కే రన్ పోటీలు నిర్వహించగా, ముఖ్య అతిథిగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ నుంచి బతుకమ్మ ఘాట్ దాకా 2కే రన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అధికారులు విద్యార్థులు యువతతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాల వేడుకలను ప్రభుత్వం పండగ వాతావరణం లో ఘనంగా నిర్వహిస్తుందని, ఇందులో భాగంగా సిరిసిల్ల జిల్లాలో 2 కే రన్ నిర్వహించామని అన్నారు.2కే రన్ లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులను, యువతను కలెక్టర్ అభినందించారు.విద్యార్థులు, యువత చదువుతోపాటు, ప్రతి రోజూ కొంత సమయాన్ని క్రీడలకు కేటాయించాలని పిలుపు నిచ్చారు.గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చేందుకు, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని తెలిపారు.

క్రీడాకారులు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో డీ.ఈ.ఓ.రమేష్ కుమార్, డీ.వై.ఎస్.ఓ.రాందాస్, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ లావణ్య, పీ.డీలు, పీ.ఈ.టీ.లు, వాలీ బాల్ అకాడమీ క్రీడాకారులు, యువతీ యువకులు , ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, మహిళా సంఘాలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube