టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు( Superstar Mahesh Babu ) ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.దీంతో మహేష్ బాబు ఈ మధ్యకాలంలో బయట పెద్దగా కనిపించడం లేదు.
ప్రస్తుతం రాజమౌళి( Rajamouli ) మూవీ కోసం మేకోవర్ అవుతున్నాడు.వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ మూవీ షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి.
అంతవరకు మహేశ్ అయితే పెద్దగా కనిపించడని చాలామంది అనుకున్నారు.రాజమౌళి సినిమా అంటే ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే.

ఆయన సినిమా చేయాలంటే కఠినమైన విషయాలను పాటించాల్సిందే.ఇకపోతే మహేష్ బాబు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీ బిజీగా ఉండగా ఆయన భార్య నమ్రత కూతురు సితార మాత్రం తాజాగా ముంబైలో కనిపించారు.ప్రముఖ పాప్ సింగర్ దువా లిపా కన్సర్ట్‌కి హాజరయ్యారు.బ్లాక్ అండ్ బ్లాక్ ఔట్ ఫిట్‌లో కనిపించారు నమ్రత, సితార( Namrata, Sitara ).ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.కాగా సితార ప్రస్తుతం టీనేజీ అమ్మాయి.
అంతే కాకుండా సితార డ్యాన్సుల్లో మంచి ప్రావీణ్యం సంపాదించింది.అలాగే ఎత్తు, అందంలోనూ తల్లి తండ్రులని మించిపోయేలా కనిపిస్తోంది.

సితారని చూస్తుంటే అందం విషయంలో మహేశ్‌ని మించిపోతుందేమోనని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.ఈ వయసుకే తల్లి తండ్రి అందాన్ని డామినేట్ చేస్తోంది సితార.తాజాగా ముంబైలో సితార అలాగే నమ్రత కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇంత చిన్న వయసుకే తల్లి అందాన్ని డామినేట్ చేస్తోంది ఇంకా పెద్ద అయితే హీరోయిన్ అవ్వడం పక్క అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం సితార నమ్రత కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.







