మధ్యాహ్న భోజనము తనిఖీ చేసిన మాజీ విద్యా కమిటీ చైర్మన్

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు.పరిసరాల పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి సారించాలని కోరిన ఒగ్గు బాలరాజు యాదవ్.

 Former Education Committee Chairman Who Inspected The Lunch , Education Committe-TeluguStop.com

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం ను పాఠశాల విద్యా కమిటీ మాజీ చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్ తనిఖీ చేశారు.ఇటీవల మధ్యాహ్న భోజనం సరిగా ఉండడం లేదని వరుసగా విద్యార్థుల నుండి పిర్యాదులు అందిన నేపథ్యంలో మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు.

ప్రభుత్వం నుండి నాణ్యమైన బియ్యం పాఠశాలకు అందేలా చూస్తానని విద్యార్థులు, ఉపాధ్యాయులతో అన్నారు.భోజనం సరిగా చేయాలని నిర్వాహకులతో ఆయన అన్నారు.

వంట గది నీ పరిశీలించి అక్కడక్కడ నీరు ఆగుతుందనీ ఇట్టి విషయంలో పరిష్కారం చూపాలని గ్రామ స్పేషల్ ఆఫిసర్ సత్తయ్య దృష్టికి తీసుకు వెళతానని అన్నారు.వంట గది,గది చుట్టూ పక్కల గల పరిసరాలను ఎప్పటికప్పుడు బ్లీచింగ్ తో శుభ్రం చేయాలని పాఠశాలలో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బందికి ఒగ్గు బాలరాజు యాదవ్ సూచించారు.

అదే విదంగా మార్చ్ 18నుండి పదవ తరగతి విద్యార్థులకు జరగబోయే పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థుల ప్రగతిని పాఠశాల ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube