మధ్యాహ్న భోజనము తనిఖీ చేసిన మాజీ విద్యా కమిటీ చైర్మన్
TeluguStop.com
విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు.పరిసరాల పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి సారించాలని కోరిన ఒగ్గు బాలరాజు యాదవ్.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం ను పాఠశాల విద్యా కమిటీ మాజీ చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్ తనిఖీ చేశారు.
ఇటీవల మధ్యాహ్న భోజనం సరిగా ఉండడం లేదని వరుసగా విద్యార్థుల నుండి పిర్యాదులు అందిన నేపథ్యంలో మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు.
ప్రభుత్వం నుండి నాణ్యమైన బియ్యం పాఠశాలకు అందేలా చూస్తానని విద్యార్థులు, ఉపాధ్యాయులతో అన్నారు.
భోజనం సరిగా చేయాలని నిర్వాహకులతో ఆయన అన్నారు.వంట గది నీ పరిశీలించి అక్కడక్కడ నీరు ఆగుతుందనీ ఇట్టి విషయంలో పరిష్కారం చూపాలని గ్రామ స్పేషల్ ఆఫిసర్ సత్తయ్య దృష్టికి తీసుకు వెళతానని అన్నారు.
వంట గది,గది చుట్టూ పక్కల గల పరిసరాలను ఎప్పటికప్పుడు బ్లీచింగ్ తో శుభ్రం చేయాలని పాఠశాలలో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బందికి ఒగ్గు బాలరాజు యాదవ్ సూచించారు.
అదే విదంగా మార్చ్ 18నుండి పదవ తరగతి విద్యార్థులకు జరగబోయే పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థుల ప్రగతిని పాఠశాల ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
మరోసారి పెళ్ళిచేసుకున్న శృంగార తార