జీవశాస్త్రం ఉపాద్యాయుడిని నియమించండి - ఎంఈఓ కార్యాలయం లో వినతి పత్రం అందజేత

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్రం బోధించే ఉపాధ్యాయుడిని నియమించాలని కోరుతూ మండల వనరుల కేంద్రంలో పాఠశాల విద్యా కమిటీ మాజీ చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్ వినతి పత్రం అందజేశారు.2020 ఫిబ్రవరి లో ఇట్టి సబ్జెక్ట్ బోధించే ముత్యాల వెంకట్ రెడ్డి అనే టీచర్ పదవి విరమణ చేసిన అనంతరం రెండు సంవత్సరాలు విద్యా వాలంటీర్ తో బోధించడం జరిగిందని ఆయన వినతి పత్రం లో పేర్కొన్నారు.

 Appoint A Biology Teacher Submits The Request Letter In The Meo Office, Biology-TeluguStop.com

2023-2024 వ సంవత్సరంలో విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తుందనీ దీంతో విద్యార్థులు జీవశాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు లేక విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోతున్నారని ఆయన అన్నారు.మండలంలోని ఏదేని ప్రభుత్వ పాఠశాలల్లో జీవశాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు అదనంగా ఉంటే ఇక్కడి పాఠశాలకు పంపించాలని మండల విద్యాధికారి రఘుపతి నీ ఆయన కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube