జీవశాస్త్రం ఉపాద్యాయుడిని నియమించండి – ఎంఈఓ కార్యాలయం లో వినతి పత్రం అందజేత

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్రం బోధించే ఉపాధ్యాయుడిని నియమించాలని కోరుతూ మండల వనరుల కేంద్రంలో పాఠశాల విద్యా కమిటీ మాజీ చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్ వినతి పత్రం అందజేశారు.

2020 ఫిబ్రవరి లో ఇట్టి సబ్జెక్ట్ బోధించే ముత్యాల వెంకట్ రెడ్డి అనే టీచర్ పదవి విరమణ చేసిన అనంతరం రెండు సంవత్సరాలు విద్యా వాలంటీర్ తో బోధించడం జరిగిందని ఆయన వినతి పత్రం లో పేర్కొన్నారు.

2023-2024 వ సంవత్సరంలో విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తుందనీ దీంతో విద్యార్థులు జీవశాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు లేక విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోతున్నారని ఆయన అన్నారు.

మండలంలోని ఏదేని ప్రభుత్వ పాఠశాలల్లో జీవశాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు అదనంగా ఉంటే ఇక్కడి పాఠశాలకు పంపించాలని మండల విద్యాధికారి రఘుపతి నీ ఆయన కోరారు.

ఏ మతం ఇలాంటి హింస కోరదు.. కెనడాలో హిందువులపై దాడిపై సిక్కు వ్యాపారవేత్త ఆవేదన