నేటి ఆధునిక కాలంలో మగవారికే కాదు ఆడవారికీ మద్యం సేవించే అలవాటు ఉంటుంది.మద్యపానం ఆరోగ్యానికి హానికరం, శరీరంలోని అవయవాలు దెబ్బ తింటాయి అని తెలిసినా మద్యం ప్రియులు తాగడం మాత్రం మానరు.
ఇక మద్యం సేవించేటప్పుడు మంచింగ్ పేరుతో రకరకాల ఆహారాలను తినేస్తుంటారు.అయితే నిజానికి మద్యం సేవించే సమయంలో కొన్ని కొన్ని ఫుడ్స్ అస్సలు తినరాదు.
మరి ఆ ఫుడ్స్ ఏంటీ అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది మద్యం తాగేటప్పుడు కారం కారంగా ఉండే చిప్స్ ను తింటుంటారు.
అయితే మద్యం సేవించే టైమ్‌లో చిప్స్‌ను తీసుకోవడం వల్ల శరీరంలో వేగంగా డీహైడ్రేట్ అయిపోతుంది.అలాగే కడుపు నొప్పి, వాంతులు వంటి సమస్యలను కూడా ఎదర్కోవాల్సి వస్తుంది.
అలాగే కొందరు ఆడవారు వైన్ తీసుకునే సమయంలో చాక్లెట్ తింటుంటారు.కానీ, ఇలా చేయడం చాలా డేంజర్.
వైన్ తో పాటు చాక్లెట్ తీసుకుంటే గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలతో పాటు జీర్ణ వ్యవస్థ పని తీరు కూడా మందగిస్తుంది.

సాధారణంగా కొందరు మద్యం తీసుకునే సమయంలో మంచింగ్‌గా వేయించిన బీన్స్‌ను తింటుంటారు.కానీ, ఇది సరైన కలయిక కాదు.బీన్స్‌లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది.
అందు వల్ల, మద్యం తీసుకునే సమయంలో బీన్స్ తీసుకుంటే.అందులో ఉండే ఐరన్ శరీరంలో కలవదు.
దాంతో అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇక మద్యం సేవించేటప్పుడు లేదా సేవించిన తర్వాత బ్రెడ్, బ్రెడ్ ఆమ్లెట్ వంటివి అస్సలు తీసుకో రాదు.
అలా తీసుకుంటే వికారం, వాంతులు, తలనొప్పి వంటి సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది.కావాలీ అని అనుకుంటే.మద్యం తీసుకునే సమయంలో ఉడికించిన చికెన్, లైట్‌గా వేయించిన కూరగాయ ముక్కలు తీసుకుంటే మంచిది.