కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్రావు ముద్రించిన కరపత్రాల ఆవిష్కరణ

రాజన్న సిరిసిల్ల జిల్లా : కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్రావు తన గెలుపు కోసం ముద్రించిన కరపత్రాలను ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు తో కలిసి మంగళవారం ఆవిష్కరించారు.కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం.

 Leaflets Printed By Congress Mp Candidate Velishala Rajendra Rao, Leaflets , Con-TeluguStop.com

కరీంనగర్ కి అసలైన వారసుడు అభివృద్ధికి నిజమైన సేవకుడు.కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ కార్డును హాస్తం తో నే మార్పు సాద్యం అనే కాంగ్రెస్ పార్టీ కరపత్రాలను ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు మంగళవారం కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్రావు ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుతూ అందుకు సంబంధించిన కరపత్రాలను వారు ఆవిష్కరించారు.

అట్టి కరపత్రాలను కాంగ్రెస్ పార్టీ జెండాలను, పార్టీ కండువాలను మండల అధ్యక్షులు లక్ష్మారెడ్డి మండలంలోని వివిధ గ్రామాలకు వెళ్లి ఆయా గ్రామాల్లో గ్రామ శాఖ అధ్యక్షులకు డిస్ట్రిబ్యూషన్ చేశారు.

అదేవిధంగా మే 1వ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు ఎల్లారెడ్డిపేట పాత బస్టాండ్ లో జరిగే కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్ కు కేటాయించిన టార్గెట్ ప్రకారం గా జనాన్ని పెద్ద ఎత్తున తరలించి విజయవంతం చేయాలని ఆయన గ్రామ శాఖల అధ్యక్షులను లక్ష్మారెడ్డి కోరారు.

ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సభ్యులు ఏలూరి రాజయ్య , కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండాపురం శ్రీనివాస్ రెడ్డి ,నంది కిషన్ , బండారి బాల్ రెడ్డి, అంతేర్పుల గోపాల్ , కొర్రి రమేష్ , వంగ బాల్ రెడ్డి, భూమి రెడ్డి, చరణ్ గౌడ్, గణపతి నాయక్, ముద్రకోల శ్రీ నివాస్, భగవంతరెడ్డి , సోషల్ మీడియా ప్రతినిధి బీపేట రాజ్ కుమార్ , నీరటీ భూమ రాజం, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube